Beet Root : బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా…ఈ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త….!
Beet Root : బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీర ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అనేది వాస్తవం. బీట్ రూట్ ను తీసుకోవడం వలన రక్త ప్రసన్న పెరగడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక బీట్ రూట్ లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల విటమిన్లు ఐరన్ పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగు పడడానికి దోహదపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్ రూట్ మరి ఎక్కువగా తీసుకోవడం వలన కూడా నష్టాలు వస్తాయట. ఎందుకంటే అమృతమైన ఎక్కువసార్లు తీసుకుంటే విషమవుతుంది కదా.. మరి ముఖ్యంగా కొన్ని రకాల సందర్భాలలో బీట్ రూట్ తీసుకోవడం వలన శరీరానికి అసలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Beet Root : కిడ్నీలో రాళ్లు…
బీట్ రూట్ లో అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో వీటిని తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే బీట్ రూట్ లో ఆక్సలైట్ అనే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తాయి. అంతేకాక ఇది మూత్రంలోని ఆక్సలెట్ విసర్జనను ఎక్కువ చేస్తుంది. తద్వారా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అనేవి ఏర్పడతాయి. కావున బీట్ రూట్ లను తగిన పరిమాణంలో మాత్రమే తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎక్కువగా తిన్నట్లయితే కిడ్నీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
Beet Root : నరాల బలహీనత…
డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి బీట్ రూట్ అసలు మంచిది కాదు. డయాబెటిస్ తో బాధపడేవారు బీట్ రూట్ తిన్నట్లయితే నరాల బలహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగినట్లయితే ఫైబర్ కంటెంట్ తగ్గి గ్లైసిమిక్ పెరుగుతుంది.
Beet Root : అలర్జీ సమస్యలు…
కొన్ని సందర్భాలలో బీట్ రూట్ ను ఎక్కువగా తీసుకోవడం వలన అలర్జీ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు గొంతు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.అలాగే బీట్ రూట్ లో నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నైట్రిక్ యాసిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున బీట్ రూట్ ను మితంగా తీసుకోవడం మంచిది.