Beetroot : బీట్ రూట్ గురించి అసలు నిజాలు తెలిస్తే… వావ్ అంటూ నోరెళ్లబెడతారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beetroot : బీట్ రూట్ గురించి అసలు నిజాలు తెలిస్తే… వావ్ అంటూ నోరెళ్లబెడతారు?

Beetroot : బీట్ రూట్ గురించి తెలుసు కదా. అన్ని కూరగాయల్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న రూట్ ఇది. అయితే చాలామంది బీట్ రూట్ ను పెద్దగా తినరు. దాదాపు అన్ని కూరగాయలు తిన్నా… బీట్ రూట్ అనే సరికి.. దాని దగ్గరికి కూడా పోరు. బీట్ రూటా… యాక్ అంటారు కొందరు. అసలు బీట్ రూట్ ను కూరగానూ వండుకొని తింటారని ఎంతమందికి తెలుసు. బీట్ రూట్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూరగా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 April 2021,3:59 pm

Beetroot : బీట్ రూట్ గురించి తెలుసు కదా. అన్ని కూరగాయల్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న రూట్ ఇది. అయితే చాలామంది బీట్ రూట్ ను పెద్దగా తినరు. దాదాపు అన్ని కూరగాయలు తిన్నా… బీట్ రూట్ అనే సరికి.. దాని దగ్గరికి కూడా పోరు. బీట్ రూటా… యాక్ అంటారు కొందరు. అసలు బీట్ రూట్ ను కూరగానూ వండుకొని తింటారని ఎంతమందికి తెలుసు. బీట్ రూట్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూరగా మాత్రమే కాదు… బీట్ రూట్ ను జ్యూస్ గానూ చేసుకొని తాగొచ్చు. అయితే… బీట్ రూట్ గురించి అసలు నిజాలు తెలిస్తే… బీట్ రూట్ ను అస్సలు వదిలిపెట్టరు. వెంటనే మార్కెట్ నుంచి తెచ్చుకొని మరీ తినేస్తారు.

health benefits of beet root

health benefits of beet root

బీట్ రూట్ చూడటానికి ఎర్రగా ఉంటుంది. సేమ్ రక్తంలా కనిపిస్తుంది. బీట్ రూట్ ను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీట్ రూట్ ను అలాగే కడుక్కొని పైన పొట్టు తీసి పచ్చిగానూ తినేయొచ్చు. లేదంటే… జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదా సలాడ్స్ రూపంలో అయినా తినొచ్చు. కూరగానూ చేసుకొని తినొచ్చు. ఎలా తిన్నా బీట్ రూట్ లో ఉన్న పోషకాలన్నీ శరీరంలోకి వెళ్తాయి.

Beetroot : బీట్ రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

బీట్ రూట్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే… బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు… నొప్పులను వాపులను తగ్గిస్తాయి. చాలామందికి నడుపు నొప్పులు, ఇతర కీళ్ల నొప్పులు వస్తుంటాయి. వయసు మీద పడిన వాళ్లకు ఎక్కువగా కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అటువంటి వాళ్లు బీట్ రూట్ ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే… బీట్ రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుచుతుంది. బీట్ రూట్ లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్ల వల్ల హైబీపీ తగ్గడంతో పాటు గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలావరకు తగ్గుతుంది. అలాగే… ఈ నైట్రేట్లు మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. బీట్ రూట్ లో పోషకాలే కాదు.. పలు విటమిన్లు కూడా ఉంటాయి. అలాగే చాలా రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రకాల వ్యాధులను తరిమికొట్టడమే కాకుండా… ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది