Fenugreek Leaves : పరిగడుపున ఈ ఆకులను తీసుకుంటే చాలు… ఆ సమస్యలన్నీ మాయం…!
ప్రధానాంశాలు:
Fenugreek leaves : పరిగడుపున ఈ ఆకులను తీసుకుంటే చాలు... ఆ సమస్యలన్నీ మాయం...!
Fenugreek leaves : ప్రస్తుతం మన ఉన్న ఈ కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో గజిబిజిగా గడిపేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే మంచి జీవనశైలిని పాటించటం మరియు ఆహారాన్ని తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి.ఈ ఆకుకూరలలో మెంతి కూర కూడా ఒకటి. నిజానికి మెంతులు అనేవి చాలా చేదుగా ఉన్నప్పటికీ, మెంతికూర మాత్రం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మెంతి కూరలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మెంతి ఆకులనేవి ఎన్నో సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. ఈ మెంతి కూరను రోజుకు రెండుసార్లు గనక తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు తీసి పేగులను క్లీన్ చేస్తుంది.ఈ ఆకులో ఎన్నో విటమిన్లు, పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయి. ఇది అర్ధరైటిస్ నివారణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ మెంతి ఆకులను ఉదయాన్నే నమిలి తినడం వలన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ మెంతి ఆకులను ప్రతినిత్యం తీసుకోవడం వలన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే పరిగడుపున ఈ మెంతి ఆకులను తీసుకోవడం వలన దీనిలో ఉన్న ఔషధాలు సమస్యలతో పోరాడి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఉదయాన్నే నాలుగు నుండి కొన్ని మెంతి ఆకులను నోట్లో వేసుకొని నమలడం వలన ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నియంత్రించవచ్చు అని అంటున్నారు. అయితే ఉదయాన్నే మెంతి ఆకులను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
మెంతి ఆకుల ప్రయోజనాలు : ఈ మెంతి ఆకులలో విటమిన్ ఏ,సి, ఇ,బీ కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఈ ఆకులను ప్రతినిత్యం తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ మెంతి ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే వ్యాధులతో కూడా పోరాడగలదు. ఈ మెంతి ఆకులను ఉదయం పరిగడుపున నమ్మడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో ఉన్న పొటాషియం,మెగ్నీషియం అనేది గుండె వేగాన్ని అదుపులో ఉంచుతాయి. ఇది గుండెకు సంబంధించిన సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది.
ఈ మెంతి ఆకులలో పీచు ఎక్కువగా ఉంటుంది. కావున దీనివల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. మెంతికూరలో విటమిన్ ఏ, ఇ ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతేకాక ఇది అలర్జీలను కూడా నియంత్రిస్తుంది. అలాగే మెట బాలిజం ను పెంచడంలో కూడా మెంతులు ఎంతో సహాయపడతాయి. ఇది బరువులు కంట్రోల్లో ఉంచుతుంది. వీటిని తీసుకోవడం వలన ఆకలి కూడా తగ్గుతుంది. శరీరానికి కావలసిన శక్తిని పెంచుతుంది. మెంతులలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వలన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది శరీరాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది.ఇలా ఎన్నో సమస్యలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నా మెంతి కూరను ఉదయాన్నే నాలుగు ఆకులు నమిలి తినడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ట్రై చేయండి…