Fenugreek Leaves : మెంతికూరను తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏమిటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Fenugreek Leaves : మెంతికూరను తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏమిటో తెలుసా...!!
Fenugreek Leaves : ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలుసు. అయితే మనం వాడే ఆకుకూరలలో మెంతుకూర కూడా ఒకటి. అలాగే మెంతులు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో మెంతుకూర కూడా అంతే మేలు చేస్తుంది. అందువలన మెంతుకూరను వారంలో ఒకటి లేక రెండు సార్లు అయినా తినాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం అవసరం. దీనివలన ఇమ్యూనిటీ అనేది పెరిగి ఎంతో హెల్తీగా ఉంటాము. మెంతికూరను తీసుకోవడం వలన శరీరం అనేది వెచ్చగా ఉంటుంది. దీనిలో మన బాడీకి అవసరమైన విటమిన్లు మరియు ఖరిజాలు, ఫైబర్ ఉంటాయి. అలాగే ఈ మెంతుకూరలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ డి కారణంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ప్రతిరోజు ఈ మెంతుకూరను ఆహారంలో భాగం చేసుకోవటం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది. ఈ కూరలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే అజీర్తి మరియు కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఔషధంగా పనిచేస్తుంది. ఈ మెతుకురలో ఉండే ఎక్కువ ఫైబర్ కారణంగా ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో మీరు బరువు ఈజీగా తగ్గుతారు. అంతేకాక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈమె ఆకుకూర ఔషధం లాగా పని చేస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిని కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ మెంతుకూర టైప్ టు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా చక్కగా పనిచేస్తుంది అని అంటున్నారు నిపుణులు.
అలాగే మెంతికూరలో ఉన్న పోషకాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. దీనివలన చర్మం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి పోషకాలు చర్మంపై ముడతలను కూడా దూరం చేస్తాయి. అలాగే చర్మాన్ని ఎంతో యవ్వనంగా ఉంచుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు ఎదుర్కొనే హార్మోన్ సమస్యలను బ్యాలెన్స్ చేయటంలో అద్భుతంగా పని చేస్తుంది. అంతేకాక మెంతుకూర పీరియడ్స్ టైం లో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే నెలసరి టైం లో వచ్చే నొప్పులు మరియు తిమ్మిరి సమస్యలకు కూడా చేక్ పెడుతుంది అని అంటున్నారు నిపుణులు.