Brain Workouts : మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్… ఇది ఎవరైనా చేయొచ్చా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brain Workouts : మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్… ఇది ఎవరైనా చేయొచ్చా…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Brain Workouts : మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్... ఇది ఎవరైనా చేయొచ్చా...?

మెదడుకు పదునుపెట్టడం అని అంటూ ఉంటారు. మరి ఆ పదును ఎలా పెట్టాలి…? శరీరానికే కాదు మెదడుకు కూడా వ్యాయామం అవసరం. మన మెదడు ఎంత బాగా పనిచేస్తుందో. అంతా తెలివి తేటలు కలిగి ఉంటాం. యూస్ ఇట్ ఆర్ లాస్ ఇట్ సూత్రం బ్రెయిన్ కు వర్తిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని రకాల వ్యాయామాల వల్ల మైండ్ పవర్ ఇంప్రూవ్ చేయగలమని పరిశోధన చెబుతున్నారు నిపుణులు. అయితే ముఖ్యంగా ఐదు నిమిషాలు చేయగలిగే సింపుల్ బ్రెయిన్ ఎక్సైజ్ సైతం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ప్రాబ్లం స్వాలింగ్, ఎబిలిటీవి ఇంప్రూవ్ చేయగలవు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఈ సింపుల్ వర్కౌట్స్ తో ప్రయోజనం పొందవచ్చు. ఇటువంటి సమయంలో 10 ఫన్ అండ్ ఎఫెక్టివ్ బ్రెయిన్ వర్కర్స్ గురించి తెలుసుకుందాం, సుడోకు, క్రాస్ వర్డ్, వర్డ్ సెర్చ్ లాంటి పజిల్స్ రోజు కొన్ని నిమిషాలు సాల్వ్ చేయాలి. ఇలాంటి ఎక్సైజ్ క్రిటికల్ థింకింగ్ పవర్ను పెంచి, ఏకాగ్రతను పెంచుతుంది. 8 సంవత్సరాలు కు పైబడిన పిల్లలు, పెద్దవాళ్లు, వృద్ధులు ప్రతిరోజు కొంత సమయం ఈ పజిల్స్ ను సాల్వ్ చేయవచ్చు. కొన్ని వస్తువులను 30 సెకండ్ల పాటు గమనించాలి. తర్వాత కళ్ళు మూసుకొని, వస్తువులన్నీ గుర్తు తెచ్చుకోవాలి, ఇది జ్ఞాపక శక్తిని పెంచే ఫన్ గేమ్. ఆరు సంవత్సరములు పైబడిన పిల్లలు, ఉద్యోగస్తులు, వృద్ధులు, చిన్న బ్రేకుల సమయంలో మెమరీ గేమ్ ఆడవచ్చు.

Brain Workouts మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్ ఇది ఎవరైనా చేయొచ్చా

Brain Workouts : మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్… ఇది ఎవరైనా చేయొచ్చా…?

డిక్షనరీలను లేదా యాప్ లు ఉపయోగించి రోజు ఐదు కొత్త పదాలు నేర్చుకోవాలి. రోజంతా ఆ పదాలను మాటల్లో వాడటానికి ప్రయత్నించాలి.విద్యార్థులు తమ పద సంపదను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. 12 /14,1256-479 లాంటి సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మనసులోనే సాలు చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. మెంటల్ క్యాల్కులేషన్ స్పీడ్ పెంచుతుంది. 10 సంవత్సరాలు పైబడిన పిల్లలు సహా అందరూ ఇలా చేయవచ్చు. మెడిటేషన్ చేయటం చాలా సులభం. ధ్యానం చేయటానికి కళ్ళు మూసుకొని డీప్ తీసుకోవాలి. శ్వాస పైనే దృష్టి పెట్టాలి. చేస్తే ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. మరి ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారికి , యువతకు, పెద్దలందరికీ ఇది మంచి వ్యాయామం. ఎన్నో టెన్షన్స్ తో నిండిపోయిన మైండ్, ఉదయం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ గా కూర్చొని ,కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుంటే , మైండ్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. శ్వాసను పిలుస్తూ, వదులుతూ వ్యాయామం చేస్తే, ఆరోగ్యంతో పాటు మెదడుకి పదును పెట్టినట్లు అవుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరమైనవి మైండ్ లో నుంచి తీసివేసి. అవసరమైనవి ఉపయోగపడేవి మాత్రమే మైండ్ లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. మానసిక వేదన ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటే, కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనసు పాడైతే మెదడు కూడా పాడైపోతుంది. కావున మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని తెలిసిన ఏదైనా ప్రదేశాన్ని ఊహించుకోవాలి. ఆ ప్రదేశంలోని రంగులు, శబ్దాలు, స్పర్శలు డీటెయిల్స్ గా ఉంచాలి. ఇటువంటి వ్యాయామాలు ఏకాగ్రతను పెంచి, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఎవరైనా సరే నిద్రపోయే ముందు లేదా బ్రేక్ సమయంలో దీన్ని చేయవచ్చు. మంచిని ఊహించుకోండి చెడును ఊహించుకోవద్దు. మైండ్ కు ఒత్తిడిని ఏమాత్రం కలిగించదు. మన మైండ్ ని మనమే రిలాక్స్ చేసుకోవాలి. పాజిటివ్ గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచించొద్దు.
ఫ్రూట్స్ లేదా జంతువుల లాంటి ఏదైనా ఒక అంశం తీసుకుని, 30 సెకండ్లో వీలైనన్ని ఫ్రూట్స్ లేదా జంతువుల పేర్లు బాగా గుర్తు చేసుకోండి. ఇది మెదడు త్వరగా ఆలోచించేలా చేసి, క్రియేటివిటీ ని పెంచుతుంది. 8 సంవత్సరాల దాటిన పిల్లలతోపాటు అందరూ ఈ గేమ్ ఆడొచ్చు.

అలాగే రోజు కొన్ని దేశాల పేర్లు, వాటి రాజధాని గుర్తులు తెచ్చుకోవాలి. డైలీ క్విజ్ గేమ్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరైనా ఎక్విజ్లో పాల్గొనవచ్చు. కొన్ని మంచి బుక్స్ చదువుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. దీంతోపాటు స్పాట్ ది డిప్రెషన్స్ ఈ యాప్/ ఇమేజ్ ను ఉపయోగించి రెండు ఇమేజ్ ల మధ్య ఉన్న తేడాలను కనుక్కోవాలి. ఈ సింపుల్ గేమ్ ఏకాగ్రతను పెంచుతుంది. ఖాళీ టైం ఉన్నప్పుడు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి. కొత్త కొత్త ప్లేస్లకు వెళుతూ అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని స్మరిస్తూ ఉండాలి. మంచి మ్యూజిక్ను వింటూ ఉండాలి. ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంగీతం ఎక్కువగా వింటూ ఉంటే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది. మైండ్ లో నుంచి నెగిటివ్ థింకింగ్ ని తీసివేసి, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే ఆలోచిస్తూ ఉండాలి. ఎక్సైజ్ లాంటివి. Five Minute Brain Workouts That Sharpen Your Brain

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది