Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?
ప్రధానాంశాలు:
Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ స్టైల్‌ను మర్చిపోవద్దని భావిస్తూ చాలామంది బిగుతుగా ఉండే దుస్తులు (టైట్ లెగ్గింగ్స్, టాప్స్) ధరిస్తుంటారు. అవి ఫిట్‌గా, ఫ్యాషన్‌గా కనిపించొచ్చు కానీ… ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని తీవ్ర సమస్యలకూ దారితీయవచ్చు. బిగుతైన దుస్తుల వల్ల కలిగే ఆరోగ్యపరమైన నష్టాలు చూస్తే… రక్తప్రసరణకు ఆటంకం..బిగుతుగా ఉన్న దుస్తులు శరీరంలోని రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.ప్రభావాలు:కండరాలకు తగినంత ఆక్సిజన్ లభించకపోవడం,త్వరగా అలసట రావడం,నర సంబంధిత సమస్యలకు దారితీయడం.

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?
Gym : ఇవి ఫాలో కండి..
చర్మ సమస్యలు: వ్యాయామ సమయంలో చెమట అధికంగా ఉత్పత్తి అవుతుంది. టైట్ దుస్తులు చెమటను పీల్చుకోకుండా చర్మానికి అతుక్కుంటాయి. పరిణామాలు:గాలి అందక తేమ పేరుకుపోవడం,దద్దుర్లు, దురదలు,స్కిన్ ఇన్‌ఫెక్షన్లకు అవకాశం. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు (ప్రత్యేకంగా మహిళల్లో),బిగుతైన దుస్తుల వల్ల యోని భాగం తడిగా ఉండి, ఫంగస్ పెరగడానికి అనుకూలంగా మారుతుంది.ఇన్‌ఫెక్షన్లు, దురద, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
టైట్ ప్యాంట్లు, లెగ్గింగ్స్ వంటివి నడుము, తొడల ప్రాంతాల్లో నరాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.
పరిణామాలు:తిమ్మిర్లు,ముసురుగా ఉండే నొప్పులు,దీర్ఘకాలంలో నరాల దెబ్బతినే ప్రమాదం. శరీర ఉష్ణోగ్రత పెరుగుదల: హీట్ ఎగ్జాషన్, డీహైడ్రేషన్ ప్రమాదం. వ్యాయామానికి సరైన దుస్తులు ఎలా ఉండాలి? వదులుగా ఉండే, గాలి ఆడే ఫాబ్రిక్స్ (కాటన్, మైక్రోఫైబర్) తో తయారైనవి. తేమ పీల్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. స్వేచ్ఛగా కదలేందుకు అవకాశం ఉండేలా ఉండాలి. శరీరం పొడిగా ఉండేలా సహాయపడే ఫాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి