Blood Pressure : లో బిపి ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?
ప్రధానాంశాలు:
Blood Pressure : లో బిపి ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?
Blood Pressure : లో బిపి ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు.. ఈ బిపి పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం..కొందరికి బిపి అమాంతం పెరిగితే మరికొందరికి బీపీ తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే లోబిపి అంటారు. మరి దీనికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. లో బీపీ ఉన్న పేషెంట్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నీరసంగా అనిపించడం, టెన్షన్ పడటం, ఏ పని చేయాలనిపించకపోవడం వంటివన్నీ కూడా లో బీబీ సూచనలే.. అనేక కారణాలవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో సతమాతమవుతున్నప్పుడు వెంటనే చెమటలు పడటం, కళ్ళు తిరగడం వంటివి కూడా వస్తూ ఉంటాయి.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. మహిళల్లో 60/100 ఎంఎంహెచ్జి మగవారిలో 70/110 ఎంఎంహెచ్డీ కంటే తక్కువ ఉంటే లోబీపీ ఉన్నట్లే.. దీనిని కంట్రోల్ చేసుకోవడం కోసం జీవనశైలి ఆహారపు అలవాటులో మార్పులు చేసుకుంటే బీపీని సాధారణ స్థితికి తీసుకురావచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా కచ్చితంగా ఆహారాన్ని కాస్త సరైన సమయాల్లో తీసుకుంటూ ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. తినాలనిపించకపోయిన కొంచమైనా తినాలి. నీరు తాగుతూ ఉండాలి.
దీనివల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దానిమ్మ బీట్రూట్ జ్యూస్ మరీ మంచిది. ఈ జ్యూస్ లు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరినీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. వీటి వల్ల లోబీబీ సమస్య తగ్గుతుంది. లోపి ఉన్నవారు సరైన సమయానికి నిద్రపోవాలి. రోజు ఖచ్చితంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం నూతన ఉత్సాహంతో ఉంటుంది..