Gas Trouble : ఇది తిన్నారంటే ఐదు నిమిషాల్లో గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది ..
Gas Trouble : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్ తయారైతే ఛాతి నొప్పి, కడుపునొప్పి, మంట వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవడం మానసిక ఆందోళనలు, దిగులు ఒత్తిడి అలసటకు గురవుతుండడం, టీ కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, చల్లటి పానీయాలు ఎక్కువగా త్రాగే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల మందులను ఎక్కువగా తీసుకోవడం వలన కూడా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. కలుషితమైన ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
చాలామందికి గ్యాస్ నొప్పి వస్తే గుండెనొప్పి అనేమో డౌట్ పడుతుంటారు ఇంచుమించు రెండూ కూడా ఒకేలా ఉంటాయి. గ్యాస్టిక్ సమస్య ఉన్నవారిలో చాతి నొప్పి వస్తుంది. గొంతులో మంటగా ఉంటుంది. కడుపు మరియు చాతి భాగంలో మండినట్లుగా ఉంటుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు నీరసంగా కూడా ఉంటారు. అలాంటివారు తక్కువ మోతాదులో తరచూ ఆహారం తీసుకుంటూ మెత్తగా నమిలి మింగాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో నూనె వాడకం తక్కువగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. అప్పుడు ఎటువంటి గ్యాస్టిక్ సమస్యలు రావు.
టీ కాఫీ సిగరెట్లు మత్తు పానీయాలు మానేయాలి. నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. అయితే గ్యాస్టిక్ సమస్య ఉన్నవారు అరటి పండ్లు తింటే గ్యాస్ రాకుండా ఉంటుంది. అరటిపండు లో ఉండే ఫైబర్ ఇందుకు దోహదపడుతుంది. అంతేకాదు దోసకాయ తినడం వలన కడుపు చల్లగా ఉంటుంది. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా చాతిలో నొప్పిగా అనిపిస్తే ఒక గ్లాసు నీళ్లు గోరువెచ్చగా కాగబెట్టి త్రాగితే కొద్ది నిమిషాల్లోనే రిలీఫ్ వస్తుంది. అలాగే త్వరగా జీర్ణ ఆహారాలను తీసుకోవాలి. బయటపదార్థాలను తినకుండా ఉండడం మంచిది. వీటి వలన గ్యాస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాస్ సమస్యల వలన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం మంచిది.