Green Tea Pack : గ్రీన్ టీ బ్యాగులతో కూడా మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Green Tea Pack : గ్రీన్ టీ బ్యాగులతో కూడా మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా...!!
Green Tea Pack : గ్రీన్ టీ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే గ్రీన్ టీ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై పెరిగినటువంటి అవగాహన నేపథ్యంలో చాలామంది ప్రతిరోజూ టీకి బదులుగా గ్రీన్ టీ ని తాగుతున్నారు. ఈ గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ గ్రీన్ టీ తాగిన తర్వాత ఆ బ్యాగులను చాలామంది పారేస్తూ ఉంటారు. కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. ఈ గ్రీన్ టీ బ్యాగుల ద్వారా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అని అంటున్నారు. అయితే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం…
గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ తో చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. అలాగే ముల్తానీ మట్టి మరియు పసుపు, బియ్యం పిండి, అరటి పండుతో గ్రీన్ టీ ని వాడడం వలన డెడ్ స్కిన్ కూడా పోతుంది. అలాగే ఇది మొటిమలను తగ్గించడంలో మరియు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాక ముల్తాని మట్టి మరియు గ్రీన్ టీ కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వలన చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముల్తానీ మట్టిలో హైడ్రేటింగ్ అనే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్నిహైడ్రేడ్ గా ఉంచుతాయి. అంతేకాక డెడ్ స్కిన్ మరియు ఎక్సెస్ ఆయిల్ ను కూడా తొలగిస్తుంది. అలాగే బియ్యం పిండి గ్రీన్ టీ కలుపుకొని ఫేస్ ప్యాక్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవడం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. దీనికోసం ఒక టీ స్పూన్ బియ్యం పిండిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం మరియు గ్రీన్ టీ ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ అనేది ఈజీగా తొలగిపోయి మీ ముఖం ఎంతో నిగారిస్తుంది.
అలాగే గ్రీన్ టీ లో పసుపు కలుపుకొని తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని వారానికి రెండుసార్లు పసుపు మరియు గ్రీన్ టీ పేస్ ప్యాక్ ముఖానికి అప్లే చేసుకున్నట్లయితే చర్మం అనేది ఎంతో మెరుస్తుంది. అంతేకాక అరటి పండులో గ్రీన్ టీ కలిపి తీసుకుంటే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలం చర్మం పొడిబారకుండా ఉండటానికి అరటిపండు మరియు గ్రీన్ టీ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇది చర్మాని ఎంతో తేమగా మారుస్తుంది. అలాగే గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ను తగ్గించటం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి