Green Tea : గ్రీన్ టీ తాగడం వలన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే.. ఎందుకంటే గ్రీన్ టీ అనేది ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ . కొవ్వును కరిగించడంలో బాగా తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా ఏంటి ఏజెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి అందంగా యంగ్ గా కనిపిస్తారు. రుచికి చేదుగా అనిపించినా గ్రీన్ టీ తాగడం వలన ఇంకా చాలా లాభాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. మరి అలాంటి గ్రీన్ టీ తాగే విషయంలో మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. దాని విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలని చెప్తున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది కదా అని చాలామంది పరగడుపున తాగుతూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగేస్తే చాలా మేలు అనేది కేవలం అపోహ మాత్రమేనట.. గ్రీన్ టీలో కెపిన్ ఉంటుంది.
కాబట్టి పరగడుపున దాన్ని తీసుకోవడం ఏమాత్రం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎడాపెడా గ్లాసులకొద్దీ గ్రీన్ టీ ని తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే చాలు. ఎందుకంటే ఏదైనా తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే టీ తీసుకోవడం చాలా మందికి అలవాటు అలా తీసుకుంటే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందనేది చాలా మంది విశ్వాసం. కానీ అది కేవలం అపోహ మాత్రమే.. ఎందుకంటే తిన్న వెంటనే గ్రీన్ టీ తీసుకుంటే అది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయదు. కాబట్టి తిన్న తర్వాత అరగంట నుంచి 45 నిమిషాల తర్వాత తాగడం మంచిది. ముఖ్యంగా సాయంత్రం వేళ గ్రీన్ టీ తాగడం అంత మేలు కాదు.

దీని వల్ల రాత్రిపూట నిద్ర మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆ సమయంలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయట.. అలాగే కొంతమంది గ్రీన్ టీ బ్యాగులను రకరకాల కారణాలతో తెలియక రియూజ్ చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయవద్దు. ఎందుకంటే గ్రీన్ టీ బ్యాగులను ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక గ్రీన్ టీ బ్యాగ్ ను కప్పు నీళ్లలోకి మాత్రమే వాడాలని రూలేమీ లేదు. ఎంత ఎక్కువ హార్డ్ వాటర్ ని కలుపుకొని తాగితే అంత మంచిది అనేది అవాస్తవం. ఎక్కువ నీటితో కొద్దిగా నిమ్మరసం మరియు తేనె కలిపి సేవించడం వల్ల నోటికి కూడా రుచిగా ఉంటుంది.