Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

 Authored By sandeep | The Telugu News | Updated on :26 September 2025,7:00 am

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు తగ్గడం కూడా ఒక ట్రెండ్‌గానే మారింది. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు మోరింగ టీ (మునగాకు టీ) ప్రాచుర్యం పొందినవి. అయితే, రెండింటిలో ఏదీ బెటర్?

#image_title

గ్రీన్ టీ ప్రయోజనాలు:

కాటెచిన్స్, కెఫిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గ్రీన్ టీలో ఉంటాయి. ఇవి జీవక్రియను (metabolism) పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

శరీరంలోని ఫ్యాట్ ఆక్సిడేషన్ వేగంగా జరిగేలా చేస్తుంది. దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది.

అప్హైట్ తగ్గించడంతో పాటు, శరీరంలో వేడి పెంచే థర్మోజెనిక్ ప్రభావం వల్ల ఫ్యాట్ బర్నింగ్‌ వేగవంతంగా జరుగుతుంది.

వ్యాయామం తో కలిపితే, గ్రీన్ టీ వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో తాగితే కొంత మంది వ్యక్తులకు అసౌకర్యం కలగవచ్చు.

కెఫిన్ కు సెన్సిటివ్ అయినవారికి ఇది తగదు.

మోరింగ టీ (మునగాకు టీ) ప్రయోజనాలు:

మునగాకు టీ కెఫిన్ రహితమైనది, కాబట్టి అన్ని వయసులవారు తాగవచ్చు.

ఇందులో ఫైబర్, విటమిన్లు (A, C, E), ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండేలా చేస్తుంది. చిరుతిళ్లు తగ్గుతాయి.

క్లోరోజెనిక్ ఆమ్లం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రితమవుతుంది, కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

కడుపు ఉబ్బరం, గ్యాస్, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యల నివారణకు మంచిదిగా పనిచేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది