Guava : క్యాన్సర్ ను తగ్గించే ఫ్రూట్స్ ఏంటో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guava : క్యాన్సర్ ను తగ్గించే ఫ్రూట్స్ ఏంటో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Guava : క్యాన్సర్ ను తగ్గించే ఫ్రూట్స్ ఏంటో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Guava  : జామ పండ్లను అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు.కరోనా వచ్చినప్పటినుండి జనాలు ఫ్రూట్స్ మీద పడిపోయారు. హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటున్నారు. ప్రస్తుత కాలంలో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని కాలాలలో అన్ని పండ్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా జామపండు అన్ని కాలాలలో దొరుకుతుంది. ఈ జామ పండ్లను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతం చేసుకోవచ్చు. ధర విషయంలో కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. అందుచేతనే ఈ జామ పండు ఎక్కువగా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ జామ పండ్లు లో పుష్కలంగా లభించే విటమిన్ సి, పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు చాలా మేలు చేస్తాయి.

ఇక పరిగడుపున జామపండు తింటే రెట్టింపు లాభాలు కూడా ఉంటాయట. అయితే ఇప్పుడు ఆ లాభాలను ఒక్కసారి తెలుసుకుందాం.. జామ పండ్లు ఉండే విటమిన్ సి వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. తరచూ జలుబుతో బాధపడేవారు వారు వీటిని తినొచ్చు. జామ పండులో పుష్కలంగా ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తక్కువ క్యాలరీలతో అవసరమైన విటమిన్లు కూడా అందుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినొచ్చు. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది జీవక్రియ రేటును పెంపొందించడానికి మరియు విరోచనాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

జామ పండును ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జామకాయలో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా ఉపయోగపడతాయి. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. షుగర్ పేషెంట్లకు జామపండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జామ లో పుష్కలంగా ఉండే ఫైబర్ వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. జామ పండులో ఉండే విటమిన్లు కంటి చూపులు మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. కాంతి చూపు క్షీణతను నివారించడానికి కూడా కంటి లోపల ఉండే శుక్లాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది