Guava leaves : ఖాళీ కడుపుతో ఈ ఆకులను తీసుకోండి… ఈ సమస్యల నుండి ఉపశమనం పొందండి…
ప్రధానాంశాలు:
Guava leaves : ఖాళీ కడుపుతో ఈ ఆకులను తీసుకోండి... ఈ సమస్యల నుండి ఉపశమనం పొందండి...
Guava leave : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటాం. ఈ పండ్ల లో ఒకటి జామ పండు కూడా.
Guava leave : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటాం. ఈ పండ్ల లో ఒకటి జామ పండు కూడా. అయితే జామ పండు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకి తెలుసు. కానీ జామ ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే జామ ఆకులలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ జామ ఆకులు అనేవి సహజ ఔషధంగా పని చేస్తాయి. దీంతో శరీరానికి ఎటువంటి హాని లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జామ ఆకులను కనుక తీసుకున్నట్లయితే ఆ సమస్యల నుండి వెంటనే బయటపడొచ్చు.ఈ జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ ఆకులలో ఎన్నో రసాయనాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులనేవి ఇతర వ్యాధుల చికిత్సలో కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. ఈ ఆకులు తీసుకోవడం వలన ఏఏ వ్యాధులు దూరం అవుతాయో తెలుసుకుందాం…
క్యాన్సర్ నివారణ : ఈ ఆకులు తీసుకోవడం వలన క్యాన్సర్ కు దారి తీసే కణాలను చంపేస్తుంది. ఈ క్యాన్సర్ కారక కణాల ఉత్పరివర్తనాల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఈ జామ ఆకులను ప్రతినిత్యం తీసుకున్నట్లయితే కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించవచ్చు అని నిపుణులు అంటున్నారు..
మధుమేహం : మధుమేహం చికిత్స కు ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. జామా ఆకులలో ఎన్నో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి షుగర్ ను కూడా తొందరగా నియంత్రిస్తుంది. అంతేకాక ఖాళీ కడుపుతో కనుక జామ ఆకులను తీసుకుంటే ఇది బరువు తగ్గటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడంలో కూడా ఈ జామ ఆకు రసం ఎంతో అద్భుతంగా పని చేస్తుంది..
డయేరియా : ఈ జామ ఆకులలో యాంటీ డయాబెటిక్ గుణాలు దాగి ఉన్నాయి. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో ఈ జామ ఆకులను నమలటం వలన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం,గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. కావున ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జామ ఆకులను తీసుకోండి..
గుండె ఆరోగ్యం : ఈ జామ ఆకులలో పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఈ జామ ఆకులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా పని చేస్తుంది. అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది..
బరువు నియంత్రణ కోసం : ఈ జామ ఆకులలో ఉన్నటువంటి క్యాటేచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది..
జుట్టు,చర్మం ఆరోగ్యానికి మంచిది : ఈ జామ ఆకు లో యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ ప్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే మొటిమలు, చర్మ సమస్యలను నియంత్రించేందుకు జామాకుల రసాన్ని లేక పేస్టును కూడా ఉపయోగించవచ్చు. ఈ జామ ఆకులలో యాంటీ డాండ్రఫ్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అంతేకాక జుట్టు రాలటం,చుండ్రు లాంటి సమస్యలను నియంత్రించేందుకు జామ ఆకుల రసాన్ని తలకు మసాజ్ చేసుకోండి…