Hair Care : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటున్నారా… అయితే ఈ ఆహారాలు తినండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Care : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటున్నారా… అయితే ఈ ఆహారాలు తినండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,10:20 am

ప్రధానాంశాలు:

  •  Hair Care : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటున్నారా... అయితే ఈ ఆహారాలు తినండి..?

Hair Care : ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా జుట్టు రాలి సమస్య ఎక్కువగా ఉండడం చూస్తూనే ఉన్నాం. జుట్టు ఎక్కువగా రాలిపోతే మానసికంగా కృంగిపోతాం. బట్టతల వస్తుందని బాధపడుతుంటారు. తేజ్ జుట్టు బలంగా ఒత్తుగా పెరగాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి అనే విషయంపై అవగాహన ఉండాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను పోవడం చాలా ముఖ్యం. బయోటిన్ లేదా విటమిన్- B7 ని సమంత తప్పకుండా తీసుకుంటే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. లభించే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం…
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జుట్టు రాలే సమస్యలు ఎక్కువ అవ్వడం గమనిస్తున్నాం. జుట్టు ఎక్కువగా రాలితే బట్టతల కూడా త్వరగా వస్తుంది. కానీ జుట్టు కొంచెం రాలిన సరే.. కంగారుపడి మార్కెట్లో ఉండే షాంపూలను మరియు ఇతర ఉత్పత్తులను తెచ్చి వాడుతుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్ ని వాడితే ఇంకా జుట్టు రాలి సమస్య తీవ్రమవుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే బయోటిన్ ఉన్న ఆహారాలను తీసుకుంటే జుట్టుని రాలకుండా కాపాడుకోవచ్చు. బయోటిన్ లేదా విటమిన్ – B7 కలిగి ఉన్న ఆహారాలను తీసుకుంటే చుట్టూ సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. మరి ఈ బయోటిన్ లభించే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం….

Hair Care జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఈ ఆహారాలు తినండి

Hair Care : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటున్నారా… అయితే ఈ ఆహారాలు తినండి..?

Hair Care చిలకడదుంపలు

చిలకడదుంపలలో బయోటిన్, బీటా కెరోటిన్ ల వంటివి ఉంటాయి. ఈ దుంపలలో శరీరానికి కావలసిన విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ ఆరోగ్యకరమైన చర్మాన్ని, కణాల ఉత్పత్తికి ఎంతో సహకరిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు. వల్ల జుట్టు బలంగా దృఢంగా మారుతుంది.

ఆకుకూరలు : జుట్టు రాలే సమస్యలు నివారించుటకు ఆకుకూరలు కూడా ఒక మంచి ఆహారం. ఆకుకూరలలో ఒకటైనది పాలకూర. ఈ పాలకూరలో బయోటిన్, ఐరన్, పోలేట్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకుకూరలను ప్రతిరోజు తింటే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచే పోషకాలను కలిగి ఉంటుంది పాలకూర. జుట్టు చివర్లో చిట్లకుంట బలోపేతం చేస్తుంది. జుట్టు ఒత్తుగా, బలంగా మరియు పొడవుగా పెరుగుతుంది. పాలకూరను సలాడ్లలో సైడ్ డిష్ గా, రోజువారి భోజనంతో ఇతర మార్గాల్లో కూడా వీటిని తీసుకోవచ్చు.

మాంసాహారం : మాంసాహారం, సముద్ర ఆహారాలలో కూడా ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉంటాయి. సాంసంగ్ మరియు సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కోడిగుడ్లు : గుడ్లలో కూడా బయోటిను అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించుటకు ఉపయోగపడుతుంది. ఉండులో దాదాపు పది మైక్రో గ్రాముల బయోటిన్ కలిగి ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, జింక్,ఐరన్ లు కూడా ఉంటాయి. పై చెప్పినవన్నీ కూడా ఆరోగ్యకరమైను పొందడానికి మంచి ఆహార పదార్థాలు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది