Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!!

 Authored By ramu | The Telugu News | Updated on :23 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్...!!

Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో జరిగే సాధారణ ప్రక్రియ. సాధారణంగా 30 సంవత్సరాల దాటిన తర్వాత జుట్టు అనేది బూడిద రంగులోకి మారుతుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ మేలనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. లేకుంటే ఆగిపోతుంది. దీంతో జుట్టు అనేది తెల్లగా మారుతుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన చర్మం మరియు జుట్టు మీద కనిపిస్తుంది. అలాగే ఈ మేలనిన్ ఉత్పత్తి తగ్గడం వలన జుట్టు రంగురంగులుగా మారుతూ ఉంటుంది. అలాగే చర్మం కూడా తెల్లగా మారుతుంది. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వెనక జన్యు శాస్త్రం మరియు హైపోథెరాయిడిజం, ప్రోటీన్, ఖనిజాల లోపం, విటమిన్ లోపం లాంటి కొన్ని రకాల వ్యాధులకు మందులు తీసుకోవడం లాంటి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది తెల్ల జుట్టు కనిపించకుండా ఉండేందుకు రంగు వేస్తూ ఉంటారు. ఇలా వాటిని వాడడం వల్ల జుట్టు పై సైడ్ ఎఫెక్ట్స్ అనేది పడుతుంది. దీనిని వాడడం వలన మిగిలిన నల్ల జుట్టు కూడా తెల్లగా మారిపోతుంది.

Hair Care తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్

Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!!

ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే భయంతో కొంతమంది చిన్న వయసులో వచ్చిన తెల్లజుట్టుతో అలాగే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. మీరు కూడా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతూ మరియు హెయిర్ డే వాడితే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే, అప్పుడు మీరు కొన్ని ప్రత్యేకమైన హోమ్ రెమిడీస్ను పాటించి మీ జుట్టుకు రంగు వేసుకోవచ్చు. దీనికోసం కొన్ని మూలికలు మరియు కొన్ని ఔషధాలతో మీ జుట్టు తెల్ల బడకుండా తగ్గించడంతో పాటు జుట్టును నల్లగా మార్చుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే ఇంట్లోనే జట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఉసిరి మరియు కరివేపాకు, బ్రహ్మీ పొడి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఆయుర్వేదంలో ఉత్తమమైన మూలికా అని చెప్పొచ్చు. అలాగే కరివేపాకులో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కరివేపాకుని తీసుకోవడం వలన ఆహారం రుచిగా ఉండటమే కాక జుట్టు కూడా నల్లగా మారుతుంది. ఈ కరివేపాకు జుట్టుకు మేలు చేసే గుణాలు దాగి ఉన్నాయి. కరివేపాకు జుట్టుకు మేలు చేసే పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి మరియు విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు తగిన మోతాదులో ఉంటాయి. ఇవి జుట్టుకు ఎంతో పోషణను ఇస్తాయి. అలాగే కరివేపాకు తో పాటుగా ఉసిరికాయను వాడడం వలన జుట్టు నల్లబడటంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అయితే ఈ ఉసిరి అనేది జుట్టు మీద సహజమైన కండిషనర్ లా పనిచేస్తుంది. అలాగే జుట్టును ఎంతో మృదువుగా కూడా చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలంగా చేయడంలో మరియు జుట్టుకు పోసిన ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇకపోతే బ్రహ్మి పొడి. ఈ బ్రహ్మీ పొడిని బ్రెయిన్ టానిక్ అని కూడా అంటారు. ఈ పొడి అనేది జుట్టు మీద మ్యాజిక్ లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిని జుట్టుకి వాడడం వలన జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. నెమ్మదిగా జుట్టు కూడా నల్లగా మారిపోతుంది…

కరివేపాకు పొడి, ఉసిరి పొడి, బ్రహ్మీ పొడిని ఎలా ఉపయోగించాలి : కరివేపాకు పొడి మరియు ఉసిరి పొడి, బ్రహ్మీ పొడి ఈ మూడింటిని మెత్తగా రుబ్బుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకొని ఒక గంట పాటు ఆరనివ్వాలి. మీరు గనక ఇలా చేస్తే మీ జుట్టు ఒక గంటలోనే సహజంగా నల్లగా కనిపిస్తుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది