Hair Tips : 15 రోజులకొకసారి రాస్తే చాలు.. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : 15 రోజులకొకసారి రాస్తే చాలు.. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :14 April 2022,2:00 pm

Hair Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. స్కూళ్లకు వెళ్లే పిల్లల్లోనూ జుట్టు రాలడం కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో జుట్టు రాలడం అతి పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. ఎన్ని రకాల మందులు వాడినా.. నూనెలు రాసినా ప్రయోజనం ఉండటంలేదు. జుట్టు రాలడం ఆరోగ్య సమస్యగానే కాకుండా మానసిక సమస్యగా కూడా మారుతోంది. జుట్టు రాలే వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారు ఇది ఒకసారి ట్రై చేయండి.జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది పార్లర్ కు వెళ్లి గంటల కొద్ది కూర్చుని వేలకు వేలు రూపాయలు ఇచ్చి హెడ్ మసాజ్ చేయించు కుంటూ ఉంటారు. కానీ ఇంట్లోనే హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. హెడ్ మసాజ్ చేసుకోవడం వలన జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో ఇది కలిపి రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు పార్లర్ లో మసాజ్ కోసం వాడిన నూనెను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆరు లేదా ఏడు యాలకులు తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక పాన్ లో మీ జుట్టుకు సరిపడినంత కొబ్బరి నూనె తీసుకోవాలి. బాదం నూనె కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి నూనె రంగు మారే వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి.
తర్వాత దీనిలో ఒక చెంచా కాస్టర్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. జుట్టు జుట్టు రాలడం తగ్గించే జుట్టు పొడవుగా పెరగడం లో చాలా బాగా సాయపడుతుంది. క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్లు ఆలివ్ ఆయిల్ లేదా మస్టర్డ్ ఆయిల్ కూడా ఉపయోగించుకోవచ్చు.

hair growth remedy Tips

hair growth remedy Tips

ఈ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి.మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు పెరగడం మొదలవుతుంది. ఈ నూనె రాసిన తర్వాత గంట తర్వాత తలస్నానం చేసిన పర్లేదు లేకపోతే అలా రెండు రోజులపాటు కూడా ఉంచుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ నూనె 15 రోజులకు ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ఉపయోగించుకుంటూ 15 రోజులకు ఒకసారి ఆయిల్ ఉపయోగిస్తే సరిపోతుంది. యాలికులు కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆయిల్ ఒక సారి ఉపయోగించే సరికి తేడాను మీరే గమనిస్తారు. మీరు కూడా ఈ ఆయిల్ ను ఉపయోగించి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా చేసుకోండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది