Hair Tips : ఎంత పల్చగా అయిన జుట్టు అయినా సరే దీనిని రాస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, దృఢంగా పెరగాల్సిందే…!
Hair Tips : ప్రస్తుతం చాలామంది వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఎన్నో వేల ఖర్చుచేసిన ఈ సమస్య నుంచి ఎటువంటి ఉపశమనం కలగడం లేదు. కొందరిలో ఈ సమస్య పెరిగిపోయి జుట్టు చాలా పల్చగా తోకల తయారవుతుంది. ఈ సమస్యకి కారణాలు సరియైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి గురి అవ్వడం, పొల్యూషన్ ఇలా కొన్ని రకాల కారణాలతో ఈ సమస్యలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాళ్లకి ఇప్పుడు మనం తయారు చేయబోయే హెయిర్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆయిల్ లో ఉపయోగించేవి అన్ని నేచురల్ గా దొరికేవి కావున ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.
ఈ ఆయిల్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాడుకోవచ్చు. ఈ నూనెను తయారు చేయడానికి మొదటగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడువందల ml కొబ్బరినూనె వేసుకోవాలి. ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి స్టవ్ ని సిం లో పెట్టి దానిలో మొదటిగా ఒక చెంచా ఆవాలు వెయ్యాలి. ఆ తదుపరి ఒక చెంచా మెంతులు కూడా వేయాలి. ఆ తర్వాత నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వెయ్యాలి. తర్వాత మందార పువ్వులుని ఒక ఐదు వేసుకోవాలి. తర్వాత ఎండి ఉసిరి ముక్కలను ఒక గుప్పెడు వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయాలి. తర్వాత గరిక ఆకులని ఒక గుప్పెడు వేసుకోవాలి.
ఆ తదుపరి నాలుగు ఆకుల తులసి ఆకులని కూడా వేసి, తర్వాత గుప్పెడు మందర ఆకుల్ని కూడా వేసుకోవాలి. గుప్పెడు గోరింట ఆకులను కూడా తీసుకొని దాన్లో వేయాలి. ఇలా అన్నిటిని వేసిన తర్వాత సన్నని సెగపై నూనె కలర్ మారేవరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన ఆయిల్ ని వేడిగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ నిత్యము మనం జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా వాడడం వలన 15 రోజుల్లోనే కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది. దీనిని వారానికి రెండుసార్లు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వారంలో రెండుసార్లు గాఢత తక్కువ ఉన్న షాంపూ ని ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మీ జుట్టు ఎంతో ఫాస్ట్ గా ,ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఈ ఆయిల్ వలన ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..