Hair Tips : చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గాలంటే… ఆవాలతో ఇలా చేసి చూడండి…
Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వాతావరణం లో పెరిగిన కాలుష్యం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలే సమస్యలు వస్తున్నాయి. చుండ్రు వలన కూడా జుట్టు ఎక్కువగా ఊడుతుంది. వానాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అలాకాకుండా ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో చుండ్రు సమస్యను తొలగించుకోవచ్చు. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి మూడు స్పూన్ల ఆవాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి లాగా చేసుకోవాలి.
తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్క తీసి తురమాలి. ఈ తురుము నుండి రసాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆవాల పొడి, ఉల్లిపాయ రసం, ఒక గుడ్డు తెల్లసొన, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కూదుర్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకొని గంట దాకా ఆరనివ్వాలి. తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే ఈ రెమిడిని వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవాలు నాచురల్ హెయిర్ కండిషనర్ గా పనిచేస్తుంది.
అలాగే జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆవాల్లో ఉండే యాంటీ టీ ఫంగల్ లక్షణాలు చుండ్రులు వదిలించడంలో సహాయపడతాయి. ఆవాలు స్కాల్ప్ మరియు జుట్టు సమస్యలను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ఉల్లిపాయ రసంలో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వీటి వలన చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ చిట్కాను అనుసరించడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.