Hair Tips : మీ జుట్టూ బాగా పల్చబడిందా.? కొబ్బరి నూనెలో వీటిని కలిపి వాడి చూడండి… ఇక మీరు షాక్.!!
Hair Tips : ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఉరుకుల బెరుకుల జీవితంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన, అలాగే ఉద్యోగరీత్యా టెన్షన్స్ ఒత్తిడిలు కారణంగా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను బారి నుండి తప్పించుకోవడం కొరకు కొన్ని అందుబాటులో ఉన్న ఎన్నో రకాల ఆయల్స్, కొన్ని జెల్స్, కొన్ని షాంపులు ఇలా వాడుతూ ఉంటున్నారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలి అంటే న్యాచురల్ గా మన ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని పదార్థాలతో ఈ ఆయిల్ ను తయారు చేసి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం..
దీన్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకొని దీనిని స్టవ్ పై పెట్టి కొద్దిసేపు వేడి చేయాలి. తదుపరి కలమంద తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆ నూనెలో వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకుని కూడా ఈ నూనెలో వేయాలి. అదేవిధంగా ఈ ఆయిల్ లో ఉల్లిపాయ ను సన్నని మొక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపి స్టవ్ పై ఒక 30 నిమిషాల వరకు మరగనివ్వాలి. తరువాత స్టవ్ ఆపుకొని ఈ నూనెను చల్లారిన తర్వాత వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇది 25 రోజుల వరకు నిలువ ఉంటుంది. వీటిలో వాడిన పదార్థాలు ఒకటి కలమంద ఇది ఉడిపోయిన జుట్టు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే కరివేపాకు తలలో ఉండే ఇన్ఫెక్షన్ ను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే దురద, చుండ్రు ,తలనొప్పి లాంటి ఇబ్బందుల్ని కూడా నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ఈ నూనెను వాడుకునే ముందు మళ్లీ వేడి చేసి చల్లారి తర్వాత మీరు తలకి రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచి కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా ఒక 15 రోజులు వాడినట్లయితే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే. మళ్లీ ఒత్తుగా, పొడవుగా, సిల్కీగా పెరుగుతుంది. కాబట్టి ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుందాం. ఇది చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు. దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.