Hair Tips : ఎన్ని చేసినా జుట్టు రాలుతోందా అయితే ఓ సారి ఇది ట్రై చేసి చూడండి.. రాలమన్నా మీ జుట్టు రాలదిక
హెయిర్ ఫాల్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఎన్ని రకాల షాంపూలు, కండీషనర్లు ట్రై చేసినా కానీ హెయిర్ ఫాల్ ఆగకపోవడంతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారు ఈ చిన్న చిట్కాను పాటిస్తే హెయిర్ ఫాల్ ను ఇట్టే అరికట్టవచ్చు. ఈ చిట్కాతో మంచి ఉపశమనం లభిస్తుంది.ఈ చిట్కాలో వాడే పదార్థాలకు కూడా అంతలా డబ్బులు కావు.
వీటన్నింటినీ ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..వెల్లుల్లి పాయలతో తయారు చేసిన సీరంను వాడడం వలన హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. ఈ వెల్లుల్లి పాయల్లో మెగ్నీషియం, పొటాషియం, మరియు విటమిన్ బీ6 ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ కు బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఈ సీరంలో ఉల్లిపాయలను కూడా వాడతారు. ఉల్లిపాయలు అంటే ఎరుపు ఉల్లిపాయలను ఈ సీరంలో కలుపుతారు. ఇవి మనకు మార్కెట్లో విరివిగా లభిస్తాయి.అలాగే ఈ సీరంలో మెంతులను కూడా కలుపుతారు.
Hair Tips : ఈ సింపుల్ చిట్కాతో హెయిర్ ఫాల్ చింత ఉండదిక
ఈ మెంతుల్లో విటమిన్ కే, విటమిన్ డీ1, డీ12 పుష్కలంగా ఉంటాయి. ఒక మూడు స్పూన్ల మెంతులను ఒక బౌల్ లో తీసుకుని ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఇలా వచ్చిన నీటిని తీసుకుని అందులోకి వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారయిన మిశ్రమాన్ని రాత్రి పూట జట్టుకు అప్లై చేసుకుని తర్వాత రోజు ఉదయం తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ గ్రోత్ రెండింతలు పెరుగుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.