Hair Tips : జుట్టుకు ఆయిల్ రాసేటప్పుడు… ఈ జాగ్రత్తలు పాటించాలి… లేదంటే..!
Hair Tips : జుట్టుకు కొబ్బరి నూనె రాయడం వలన జుట్టు ఊడిపోకుండా, తెల్లబడకుండా ఉంటుందని చాలామంది తలకు నూనెను రాస్తుంటాం. అయితే కొన్ని సందర్భాలలో నూనె రాయటం వలన జుట్టు ఊడిపోతుందని నిపుణులు అంటున్నారు. జుట్టు సంరక్షణకు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకుంటారు. ఇటీవల కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రాలిపోవడం తెల్లబడడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం ఆహారం, పనిలో ఒత్తిడి, వాతావరణంలో కలిగే మార్పులు ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జుట్టు పెరగడానికి వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ ని వాడుతుంటారు.
హెయిర్ ఆయిల్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. అయితే కొన్ని సందర్భాలలో హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే జుట్టు సమస్యలు మరింతగా పెరుగుతాయి. తలపై చుండ్రు ఉన్నప్పుడు సాధారణంగా నూనె రాసుకుంటారు. అయితే జుట్టుకు ఎక్కువ చుండ్రు ఉన్నప్పుడు నూనె రాసుకోకూడదు. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు లో చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు తలపై బొబ్బలు ఉంటాయి. ఈ సమయంలో జుట్టుకు నూనె రాయడం వలన పొక్కులు మరింతగా వృద్ధి చెందుతాయి. త్వరగా తగ్గడం కూడా కష్టమవుతుంది. తలపై చర్మం జిడ్డుగా ఉన్నప్పుడు ఎక్కువగా నూనె రాయకూడదు.
జిడ్డు చర్మానికి నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. దీని కారణంగా జుట్టు ఊడిపోతుంది. తల జిడ్డుగా ఉన్నప్పుడు హెయిర్ ఆయిల్ రాయడం అలవాటు చేసుకుంటే జుట్టు మరింతగా రాలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే తల స్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనె రాసుకోకూడదు. గంట ముందు హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. రాత్రిపూట జుట్టు ఆయిల్ తో మసాజ్ చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం చాలా మంచిది. అయితే తల స్నానం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రం ఆయిల్ ని రాసుకొని తలస్నానం చేయకూడదు. అలాగే తల తడిగా ఉన్నప్పుడు నూనెను రాయకూడదు. ఆరిన తర్వాతే ఆయిల్ అప్లై చేసుకోవాలి.