Hair Tips : ఒకేరోజు జుట్టును పెంచే జెల్ మీరు నిత్యము ఉపయోగించే నూనెలో ఒక స్పూన్ యాడ్ చేయండి చాలు…
Hair Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వలన జుట్టు రాలే సమస్యలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల హెయిర్ ప్యాక్స్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదేవిధంగా వాటిలో కెమికల్స్ కలిసి కూడా ఎక్కువగా ఉండడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే సులభంగా మన జుట్టు రాలడాన్ని ఆపి పొడవుగా, ఒత్తుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. ఈ జెల్ తయారు చేయడం కోసం. ముందుగా కొబ్బరినూనె సరిపడినంత తీసుకోవాలి.
తర్వాత కలమంద మట్ట తీసుకొని శుభ్రంగా కడిగి లోపల ఉండే జల్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి తర్వాత అవిసె గింజలు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ విటమిన్ ఏ, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఈ గింజలలో కలమంద జల్ కలిపి బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టిన తర్వాత దాన్లో కొబ్బరి నూనె కూడా వేసి కొద్దిసేపు మరగబెట్టి తర్వాత చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా రాసుక వాలి. తర్వాత 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేయడం వలన రక్త ప్రసన్న బాగా జరిగి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అలాగే దీనిని ముందు రోజు రాత్రి అప్లై చేసుకోవాలి.
తర్వాత గోరువెచ్చని నీటితో గాఢ తక్కువ గల షాంపులను వాడి తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు మార్లు అప్లై చేసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గి జుట్టు పొడవుగా, ఒత్తుగా ఎదుగుతుంది. ఈ జల్ చిన్న, పెద్ద తేడా లేకుండా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఆ సమస్య తగ్గి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది.