Hair Tips : జుట్టు పెరగడానికి సులువైన చిట్కా ఇదే…
Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. అయినా జుట్టులో ఎటువంటి మార్పు ఉండదు. అంతేకాకుండా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా జుట్టు రాలకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాని కేవలం రెండు పదార్థాలతో తయారు చేయవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ఎంత పలుచటి జుట్టు అయినా సరే ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పోసుకోవాలి. తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ పై పెట్టుకోవాలి. పొంగు వచ్చేవరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బీట్రూట్ తీసుకొని దానిని సన్నగా తరిగి ఆ గిన్నెలో వేయాలి. తర్వాత బియ్యం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి.
తర్వాత ఈ నీటిని జుట్టుకురుల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకోవాలి. ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూ తో కానీ కుంకుడుకాయతో కానీ తలస్నానం చేయాలి. బియ్యం లో ఉండే విటమిన్ లు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే బీట్రూట్లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ ప్యాక్ ను ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు.