Hair Tips : కరివేపాకులో ఇది కలిపి రాశారంటే… జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది…
Hair Tips : కరివేపాకు లేకుండా మన భారతీయ మహిళలు వంట చేయడానికి ఇష్టపడరు. కరివేపాకును తాలింపులో వేస్తే మంచి వాసన వస్తుంది. చాలామంది కరివేపాకులను రుచి కోసం వాసన కోసం వాడతారని మాత్రమే తెలుసు. కరివేపాకు ఆరోగ్యానికి చేసే మంచి గురించి సరైన అవగాహన ఉండదు. అందుకే భోజనం చేసే సమయంలో కరివేపాకును తీసి ప్రక్కన పెడతారు. కానీ కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు. తెలిస్తే వాటిని వదలకుండా తింటారు. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా చక్కగా పనిచేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అయితే కరివేపాకులో వీటిని కలిపి రాస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో రెండు స్పూన్ల మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత ఇందులో కలబందని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ గుజ్జును వేరు చేయాలి. ఇప్పుడు ఆ గుజ్జును రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులను, కలబంద గుజ్జును వేయాలి. తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, రెండు స్పూన్ల పుల్లని పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ముల్తానీ మట్టి వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని జుట్టుకు కుదుళ్ల నుండి చివర్ల దాకా అప్లై చేసి పెట్టుకోవాలి. అరగంట తర్వాత షాంపూ తో కాకుండా కుంకుడుకాయ తో తలస్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు వేసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ వలన చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే పదార్థాలతో జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక, శ్రద్ధ, సమయాన్ని కేటాయిస్తే జుట్టు రాలకుండా ఒత్తైనా, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని పదార్థాలు మన జుట్టుకి మంచి పోషణను అందించి కుదుళ్లు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. మనం వంటలలో కరేపాకును వేసుకుంటాం కదా ఈసారి తినేటప్పుడు కరివేపాకును ప్రక్కన పెట్టకుండా అన్నంలో కలుపుకుని తింటే చాలా మంచిది. ఇలా చేసిన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.