Hair Tips : ఈ తైలం ఈ విధంగా వాడితే… ఊడిన ప్రతి వెంట్రుక తిరిగివస్తుంది…
Hair Tips : ఇటీవల లో ప్రతి ఒక్కరులో జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యకు ఎన్నో రకాల ఆయిల్స్, ను క్రీమ్లను, షాంపూలను వాడి వాడి..అలసిపోయి ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు నాచురల్ గా ఈ సమస్యకు ఈ విధంగా ఈ తైలాన్ని రాస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది.
ఈ తైలం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకొని దీనిలో 100 గ్రామ్స్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తర్వాత మందార పువ్వులని ఎండబెట్టి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా తయారు చేయలేనివారు మార్కెట్లో న్యాచురల్ గా దొరికే పౌడర్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇది జుట్టు రాలడం ఆపి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడంలో ఉపయోగపడుతుంది. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వచ్చేలా చేస్తుంది. తరువాత బృంగరాజ్ పొడిని కూడా దీనిలో కలుపుకోవాలి. ఇది కూడా ఆయుర్వేద షాప్ లో నేచురల్ గా దొరుకుతుంది దానిని కూడా తీసుకొచ్చి వాడుకోవచ్చు.
ఇది జుట్టు రాలడం ఆపి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. తెల్ల జుట్టు సమస్యను కూడా అరికడుతుంది. హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరినూలో మందార పొడి, బృంగరాజ్ పొడి వేసీ బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ పై పెట్టి ఐదు నిమిషాల పాటు నురగ వచ్చేంతవరకు మరగబెట్టాలి. తర్వాత ఈ నూనెను చల్లార్చుకుని వడకట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ తైలాన్ని రెండు రోజులకొకసారి తలస్నానం చేయడానికి ముందు అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకుని ఐదు నుంచి పది నిమిషాలు పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది.