Smoking : పొగరాయుళ్లకు హానికరం… జాగ్రత్త వహించకపోతే ప్రాణాలు బలి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Smoking : పొగరాయుళ్లకు హానికరం… జాగ్రత్త వహించకపోతే ప్రాణాలు బలి…!!

Smoking : పొగాకు అనేది మన శరీరానికి విషంతో సమానం. అయినప్పటికీ కూడా ప్రజలు దాని వ్యసనం కారణంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అన్ని రకాల దూమపానం లేక పొగాకు సంబంధించినటువంటి ఇతర మత్తు పదార్థాలు వినియోగం అనేది మన శారీరక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. బీడీ, సిగరెట్ లేక గుట్కా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్నో భాగాలకు తీవ్రమైన హాని కలుగుతుంది. ధూమపానం వలన మన […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,9:00 am

Smoking : పొగాకు అనేది మన శరీరానికి విషంతో సమానం. అయినప్పటికీ కూడా ప్రజలు దాని వ్యసనం కారణంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అన్ని రకాల దూమపానం లేక పొగాకు సంబంధించినటువంటి ఇతర మత్తు పదార్థాలు వినియోగం అనేది మన శారీరక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. బీడీ, సిగరెట్ లేక గుట్కా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్నో భాగాలకు తీవ్రమైన హాని కలుగుతుంది. ధూమపానం వలన మన ధమనులు బలహీన పడటం లేక వాటిసామర్థ్యం అనేది దెబ్బతింటుంది. కావున ఇలాంటి పరిస్థితుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది ఏళ్లు గా గుండెపోటుకు సంబంధించిన కేసులు పెరగటం ధూమపానం కూడా ఒక ప్రధాన కారణం. కానీ ఇలాంటి ఎన్నో పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్, బహిరంగంగా పొగ తాగటం అనేది నేరం. ఇలాంటి స్టెట్యుటరి వార్నింగులు ఎన్ని ఉన్నా గాని ఈ మహమ్మారి బారిన పడిన వారు మాత్రం ఆ రక్కసి కొర నుండి బయటపడటం లేదు. యువత ఫ్యాషన్ మత్తులో ధూమపానానికి అలవాటు పడితే. అది ఊపిరిదితులతో ఆడుకుంటుంది. క్యాన్సర్ కు కూడా దారితీస్తోంది. పొగ తాగటం అనేది ఒక వ్యసనం. ఇలా మనిషిని పీల్చి పిప్పి చేసి రోగగ్రస్తునిగా చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబాలు అనాధలు అవుతున్నారు. అందుకే ఫ్రీ వెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యుర్ అనే సూత్రం ధూమపాన విషయంలో ఎంతో బాగా పాటించాల్సిన సూత్రం. పొగాకు అనేది ఏ రూపంలో వాడినా సరే అది ఎంతో ప్రమాదకరం. స్మోకింగ్ చేయడంతో పాటుగా గుట్కా, జర్థ,పాన్ మసాలా ఇలా ఘన రూపంలో వాడినా సరే అది ప్రాణాలకు ఎంతో ప్రమాదకరం. అందువల్ల పొగాకు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దాని దరిదాపు లో కూడా వెళ్లకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి..

పొగ దీరులకు ఈ మాటలు పట్టవు : ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంత మూల్యానికి. సినిమా మొదలైన ప్రతిసారి వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇది. దీని అర్థం పొగాకు దూరంగా ఉండమని. కానీ పొగ దీరులకు ఈ మాటలు అనేవి అస్సలు పట్టవు. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు పొగకే రెండవ కారణం అని నిరుస్తుంది. ఈ తరుణంలో పొగకే మూలంగా భావిస్తున్న వ్యాధుల పట్ల చైతన్యం కలిగించటానికి ప్రతి ఏటా కూడా ఐక్యరాజ్యసమితి మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తుంది. పొగాకు వాడుకం అనేది ఈ ప్రపంచాన్నే కలవరపెడుతుంది. పొగాకు ఏ రూపంలో సేవించిన అది ఎంతో ప్రాణాంతకంగా మారుతుంది. కేవలం పొగ తాగుతున్న వారు మాత్రమే కాదు ఆ అలవాటు లేని వారు కూడా పరోక్షంగా దీని ప్రభావానికి లోనవుతున్నారు. పొగ తాగటం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పదమూడు సెకండ్లకి ఒక వ్యక్తి మరణిస్తూ ఉంటే,ప్రతి సంవత్సరం కూడా కొన్ని మిలియన్ల కొద్దీ పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్నారు అని నివేదికలు తెలిపాయి. అంతేకాక పరోక్ష స్మోకింగ్ వలన కూడా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. దీనితో పాటుగా పొగాకుతో కూడిన గుట్కా కూడా ఎంతో ప్రాణాంతకంగా మారుతుంది…

Harmful to Smokers If you are not careful you will lose your life

Harmful to Smokers… If you are not careful you will lose your life…!!

సిగరెట్ లో ఏముంది : కానీ పొగరాయులకు ఈ విషయాలనేవి అసలు పట్టవు. దీనికి తోడుగా మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రస్తుతం యువత దూమపాన్నా ని ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. సిగరెట్ లో ఏముంది పొగాకే కదా. పైగా ఫిల్టర్ సిగరెట్ తాగటం వల్ల ఏమవుతుంది. హాయిగా తేలు తున్నట్లుగా ఉంటుంది అని భావిస్తున్నారు. పొగలో 4వేల రకాల రసాయనాలు ఉంటే దీనిలో 250 రకాలు విషపూరితమైనవే. 43 రకాల క్యాన్సర్ కారకాలు. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు,అన్ టోన్, డి.డి.టి,బెంజిన్, అమోనియా, రేడాన్ అనే రసాయనాలు ఎన్నో దీనిలో ఉన్నాయి. వీటి కారణంగా 25 రకాల జబ్బులు వస్తాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దూమపానం తీవ్రత ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాక గుండెకు సంబంధించిన జబ్బులతో చనిపోయి ప్రతి ఐదు మందిలో ధూమపానానికి సంబంధించిన వారే. ఇది మాత్రమే కాక భారతదేశంలో క్యాన్సర్ కు సంబంధించిన బాధ్యతలు మూడోవంతుల లో ఒక వంతు పొగ ధీరులే. ఈ తరుణంలోనే పొగాకు సంబంధించిన వ్యాధుల పట్ల చైతన్య కలిగించడానికి ప్రతిఏటా ఐక్యరాజ్య సమితి మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజున ఈ దినోత్సవం అనేది జరిపి ప్రజలకు పొగ తాగటం వలన వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం…

పొగాకు మానేయటానికి మార్గాలు : డాక్టర్ అన్షుమన్ కుమార్ మాట్లాడుతూ, పొగాకు తాగాలి అనే కోరిక కలిగినప్పుడు దానిని విస్మరించండి. మీకు పొగాకు తాగాలి అని అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వలన ధూమపానం లేక పొగాకు వాడకం మరియు ఇతర పద్ధతుల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవచ్చు. అప్పుడు ధూమపానానికి దూరంగా ఉండటానికి నిపుణుడు సిఫారిస్ చేసిన నికోటిన్ ఇన్ హెల్లర్ నో వాడవచ్చు అని కూడా నీపునులు సలహా ఇస్తారు. అయితే వాటిని వాడే ముందు దానికి సంబంధించిన సరైన సమాచారాన్ని తెలుసుకోవాలి. సిగరెట్ తాగేందుకు ప్రోత్సహించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. వీటిని నివారించడానికి మార్కెట్లో ఎన్నో రకాల క్యాండిల్, చిగుళ్ళు అందుబాటులో ఉన్నాయి. దోమపానం నుండి దూరంగా ఉండటానికి వ్యాయామం కూడా ఒక మంచి ఎంపిక. అప్పుడే మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అప్పుడు మీ ఆరోగ్యం లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ ఆలోచన అనేది మీ మనసులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అనే కోరికను సృష్టిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది