Health Benefits : ఈ ఆకులను మూడు రోజులు ఉదయాన్నే తింటే ఎటువంటి రోగాలైనా హుష్ కాకి
Health Benefits : బిల్వ పత్రం.. ఈ ఆకులను మూడు రోజుల పాటు పరిగడుపునే తినడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మనలో చాలా మందికి అసలీ బిల్వ పత్రం ఆకులు అంటే ఏమిటి? అనే అనుమానం వస్తుంది. బిల్వ పత్రం అంటే వేరే ఏమీ కాదు. మనం సాధారణంగా పిలిచే మారేడు చెట్టు ఆకులు. మారేడు ఆకులు శివుడికి చాలా ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు. ఇక కార్తీకమాసం రోజుల్లో అయితే వీటిని చూద్దామంటే కూడా కనిపించవు. అప్పుడు ఈ ఆకులకు అంత డిమాండ్ ఉంటుంది. ఈ ఆకులతో దైవ పూజలు చేయడం మాత్రమే కాదు..
ఈ ఆకులను తినడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని మనం దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులకు సాంప్రదాయ ఆయుర్వేదంలో కూడా ఎంతో విశిష్ట స్థానం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ ఆకులను తినాలని సూచిస్తున్నారు.ఈ ఆకులను మూడు రోజుల పాటు పరిగడుపునే తినడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వీటి వలన మన శరీరంలో ఉండే పిత్త దోషం హరించబడుతుంది. మన శరీరంపై తామర, దురదలు, గజ్జి వంటివి తరుచూ దాడి చేస్తే పిత్త దోషం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి సమస్యలు ఉన్న వారు ఉదయాన్నే
ఈ మారేడు ఆకులను తినడం వలన ఆ సమస్యల నుంచి విముక్తులు కావొచ్చు. ఇక ప్రస్తుత రోజుల్లో అనేక మందిలో కామన్ గా ఉంటున్న సమస్య హై బీపీ. మన శరీరంలో ఉండే రక్తం మందం అవడం వలన బీపీ సమస్య వస్తుంది. ఈ మారేడు ఆకులకు కనుక మనం తింటే ఇవి మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా రక్తం పలుచబడుతుంది. బీపీ సమస్య మనకు తగ్గించబడుతుంది. రక్త పోటు మనకు అటాక్ కాకుండా ఉండేందుకు మన జీర్ణవ్యవస్థను మనం సక్రమంగా ఉంచుకోవాలి. దీనిని తీసుకోవడం వలన మన ముఖం మీద ఏర్పడే మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది.