Health Benefits : పొట్లకాయ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. వీటిలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే. అసలు వదలరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : పొట్లకాయ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. వీటిలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే. అసలు వదలరు…

 Authored By aruna | The Telugu News | Updated on :13 August 2022,4:00 pm

Health Benefits : పొట్లకాయ అంటే చాలామంది దీనిని ఇష్టపడరు. దీనిలో ఉన్న కొన్ని ప్రయోజనాలు తెలిస్తే ఈ పొట్లకాయ తినని వారు కూడా తప్పకుండా తింటారు. మధుమేహంతో బాధపడే వారిలో ఈ పొట్లకాయ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉండేలా చూస్తుంది. అలాగే కామెర్లతో ఇబ్బంది పడే వారికి ఈ పొట్లకాయ జ్యూస్ ఒక స్పూను నిత్యము మూడుసార్లు తీసుకున్నట్లయితే దీని నుండి మంచి ఉపశమనము కలుగుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొట్లకాయలు పీచు పదార్థం, నీరు పుష్కలంగా ఉంటాయి.

ఈ పొట్లకాయలు విటమిన్ ఏ బి సి మాంగనీస్ క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
ఈ పొట్లకాయలో ఉండేటువంటి మెగ్నీషియం రక్తపోటును నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ పొట్లకాయను నిత్యము దీని రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని సేవించినట్లయితే ఈ వ్యాధులను నివారిస్తుంది ఈ పోట్లకాయ రసం.

Health Benefits Gourd Has So Many Health Benefits

Health Benefits Gourd Has So Many Health Benefits

అందుకే ఈ పొట్లకాయని తీసుకోవడం వలన బయటికి నెట్టేసి కిడ్నీలను పనితీరు మెరుగుపడేలా చేస్తుంది. అలాగే విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఈ పొట్లకాయలు ఉండడం వలన ఎముకలకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది.
అదేవిధంగా జుట్టుకి సంబంధించి ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ పొట్లకాయ జ్యూస్ ని తలపై బాగా అప్లై చేసి 30 నిమిషాల వరకు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన చుండ్రు జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. ఇలా ఈ పొట్లకాయను అలాగే దీని జ్యూస్ ని తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది