Health Benefits : రాత్రికి రాత్రే నొప్పులన్నింటిని దూరం చేసే అద్భుతమైన చిట్కా.. మీ కోసమే!
Health Benefits : వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య అందరూ మోకాళ్లు, నడుము, వెన్ను నొప్పి లాంట సమస్యలతో బాధ పడుతున్నారు. వీటికి ముఖ్య కారమఁ ఇప్పటి మన బిజీ లైఫ్ స్టైల్. అంతే కాకుండా ఆహారపు అలవాట్లలో వచ్చిన విపరీతమైన మార్పులు కూడా మన శరీరంలో అనేక రకాల మార్పులకు కారణం అుతున్నాయి. అయితే బయట పడడానికి కొన్ని ఆహార పదార్థాలు ఈ సమస్యల నుండి చాలా బాగా ఉపశమనం కల్గిస్తాయి. అందులో ముఖ్యంగా జాజికాయ. మనం ఎక్కువగా వీటని మసాలా లాగా మాత్రమే ఉపయోగిస్తుంటాం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ఒక రెండు స్పూన్ల జాజికాయ పొడి, ఒఖ స్పూన్ పసుపు అది అప్లై చేయడానికి వీలుగా ఆవనూనె కలిపి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నీటిలోని గుణాల వల్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. అలాగే నిద్ర లేమి, డిప్రెషన్ తో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు పాలలో ఒక స్పూను జాజికాయ పొడి, అర స్పూన్ పసుపు కలిగి తాగడం వల్ల నిద్రలేమి సమస్య నివారించబడుతుంది. దీనితో పాటు జాజికాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలు మరియు క్యాన్స్ర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి రక్షించడంలో సహాయ పడుతుంది.
అలాగే జాజికాయ నూనెను అనేక దంత ఉత్పత్తులలో ఉపయోగస్తారు. ఈ మసాలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉంది. ఇది పంటి వ్యాధి మరియు దుర్వాసనకు కారణం అయ్యే నోటిలోని వ్యాధికారిక క్రిములకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా నిరూపించబడింది. అలాగే జాజికాయ మగ వారిలో యాంటీడిప్రెసెంట్గా పని చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. అయితే పురుషుల్లో లైంగిక శక్తిని పెంచడానికి, శీఘ్ర స్ఖలనాన్ని నివారించడానికి ఉపయోగించబడింది. జాజికాయ నొప్పిని తగ్గించడం, అజీర్తిని ఉపశమనం చేయడం, మెదడు పనితీరును బలోపేతం చేయడం మంచిది. అయితే లుకేమియాను నివారించడం మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కల్గి ఉన్నట్లు తెలిసింది.