Health Benefits : నరాల వాపు, నొప్పి ఇట్టే తగ్గిపోతాయి.. రక్తనాళాల్లో బ్లాకేజెస్, వాత రోగాలు మటుమాయం
Health Benefits : ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో నరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సాధారణం అయిపోయాయి. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు చాలా మందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. గుండెల్లో రక్తం వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వంటి ఇతర అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ ముఖ్య కారణం మన ఆహారంలో ఆరోగ్యకరమైనవి తీసుకోవడం తగ్గించి అనారోగ్యకరమైనవి ఎక్కువగా తినడమే. ఈ సమస్యను అధిగమించడానికి మన ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి.ఆకు కూరలు, తాజా తాజా పండ్లు, ఫ్రెష్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు.. మంచిగా నానబెట్టిన గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఆల్మండ్, అక్రోట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజాలు పుష్కలంగా అందిస్తాయి. అలాగే నరాల నొప్పులను, నరాల వాపు తగ్గించడానికి మరికొన్ని చిట్కాలు పాటిస్తే చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
దానికోసం మొదట ఒక వంద గ్రాముల అవిసె గింజలు, 100 గ్రాములు నువ్వులు తీసుకోవాలి. వీటిని ఒక రెండు నిమిషాలపాటు వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. రోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ సరిపడా పొడిని వేసి బాగా కలుపుకుని తాగాలి. లేదా ఆ పొడిని అలాగే మింగేసి గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. అవిసె గింజలు మొత్తం రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మరియు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL, లేదా “చెడు”) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాల నుండి కాపాడుతుంది. నువ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, B విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలకు మంచి మూలం.మరో చిట్కా ఏమిటంటే… ఒక స్పూన్ మెంతులు ఒక ఇంటి దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో నాన బెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలను నివారించవచ్చు.
మెంతి గింజలు రెగ్యులర్ వినియోగం రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ప్రయోజనకరమైన HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఎందుకంటే ఈ గింజల్లో స్టెరాయిడ్ సపోనిన్లు ఉంటాయి. ఇవి పేగుల కొలెస్ట్రాల్ శోషణను నెమ్మదిస్తాయి. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే శక్తి వంతమైన యాంటీ-డయాబెటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతపై ప్రయోజనకరమైన ప్రభావాలే కాకుండా, దాల్చినచెక్క అనేక ఇతర విధానాల ద్వారా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగడం వలన మంచి నిద్రతో పాటు ఈ పాలలో ఉండే కాల్షియం శరీరానికి అన్ని ఎముకలు బలంగా అవుతాయి