Health Benefits : ఈ ఆకులలో ఉన్న సీక్రెట్ ఏంటో మీకు తెలుసా… అయితే తెలుసుకోండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ ఆకులలో ఉన్న సీక్రెట్ ఏంటో మీకు తెలుసా… అయితే తెలుసుకోండి…

Health Benefits : దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ దానిమ్మ పండును తీసుకోవడం వలన రక్తహీనత తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు దీని ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ ఆకు వలన సీజనల్గా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. స్టవ్ పై గిన్నె పెట్టి […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 September 2022,7:30 am

Health Benefits : దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ దానిమ్మ పండును తీసుకోవడం వలన రక్తహీనత తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు దీని ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ ఆకు వలన సీజనల్గా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో గ్లాస్ నీళ్లు పోసి దానిలో పది ఆకులను దానిమ్మాకులను వేసి ఐదు నిమిషాల వరకు మరగపెట్టి ఆ నీటిని వడకట్టి త్రాగడం వలన దగ్గు నుండి విముక్తి కలిగి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

ఈ దానిమ్మ ఆకులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో వచ్చినటువంటి పుండ్లను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నోటి పూత వచ్చినప్పుడు ఈ ఆకుల జ్యూస్ ను నోట్లో వేసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. ఈ దానిమ్మ ఆకులలో ఉన్నటువంటి ఖనిజాలు, పోషకాలు జీర్ణ క్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆకుతో మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే ఈ ఆకుల రసాన్ని దానిమ్మ జ్యూస్ లో కలుపుకొని తీసుకోవచ్చు..

Health Benefits Of Pomegranate leaves In Telugu

Health Benefits Of Pomegranate leaves In Telugu

ఈ ఆకుల రసాన్ని రాత్రి పడుకునే సమయంలో దీని త్రాగడం వలన నిద్రలేని సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. దానిమ్మ ఆకుల పేస్ట్ ని చర్మం దద్దుర్లపై, పుండ్లపై కానీ రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ ఆకుల పేస్ట్ ని మొటిమలు నివారించటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఈ ఆకులను వినియోగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది