Health Benefits : ఈ చెట్టు కాయలు, ఆకులు, వేర్లు అన్నీ అద్భుతాలే.. ఎక్కడా కనిపించినా వదలకండి
Health Benefits : మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. పొలాల దగ్గర, రాళ్ల వద్ద ఎక్కువగా పెరుగుతుంటాయి. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడిమ కాయలను మీరు చూసేఉంటారు.. ఇది తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. ఈ పండ్లు అనేక ఔషద గుణాలు, విటమిన్లను కలిగి ఉంటాయి.చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తినిపిస్తే నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది.
అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు. పొలాల్లో పని చేసే వారికి గాయాలు అయితే ఈ కాయల నుంచి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. ఈ ఆకులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరవు. అలాగే కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి పేస్ట్ గా తయారు చేసి నొప్పులు ఉన్న చోట కట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Health Benefits in budama kaya mokka gurinchi
Health Benefits : ఎన్నో ఔషద గుణాలు..
అలాగే షుగర్ పేషెంట్స్ ఈ చెట్టు వేర్లను కషాయంగా తయారుచేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ వేర్ల రసాన్ని పొట్టపై రాస్తే కడుపులో ఉండే ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఈ కాయలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. లైంగిక సమస్యలు ఉన్నవారు కూడా ఈ కాయలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రెగ్యూలర్ గా ఈ కాయలను తీసడం వల్ల క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.చర్మ సమస్యలతో భాదపడేవారు ఈ కాయల రసాన్ని చర్మంపై పూస్తే సమస్యలు తగ్గిపోతాయి. ఈ చెట్టు వేరు కషాయాన్ని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది.