Health Benefits : ఇలా చేసి ఎసిడిటీని కంట్రోల్ చేయండి.. అది తింటే ఇంక మీకు ఆ భాద ఉండదు
Health Benefits : చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, గ్యాస్ వంటివి వస్తుంటాయి. ఇది క్రమంగా ఛాతీలో భరించలేని మంటకు దారితీయడంతో పాటుగొంతు అంతా మండినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలనే ఎసిడిటీ అంటారు. ఎక్కువగా తినడం, టైం కి తినకపోవడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ పాటించడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు.
కొన్ని చిట్కాలు వాడి ఎసిడిటీని తరిమేయొచ్చు.సాధారణంగా మనం తినే ఆహారంలో వాడే అతిమధురం చక్కర కంటే కొంచెం తియ్యగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్పెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రెగ్యూలర్ గా ఫుడ్ లో తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు తగ్గిస్తుంది. అతిమధురం రూట్ హెపటైటీస్ వంటి వైరల్ ఇన్పెక్షన్లను కూడా తగ్గిస్తుంది.ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి. ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తినవద్దు. పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

Health Benefits in drink to reduce gastric pain acidity acid reflux heartburn
Health Benefits : ఎసిడిటీ రాకుండా ఇలా చేయండి..
ఎక్కువ గంటలు ఆకలితో ఉండకండి. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ పాటించకండి.ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్ తాగాలి. భోజనం తర్వాత సోంపు గింజలను తినాలి. మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగాలి. ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల కూడా ఎసిడిటీ రాకుండా చేయవచ్చు. నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకుంటే నిద్రలేమి, మలబద్ధకానికి చెక్ పెడుతుంది. రోజ్ వాటర్, పుదీనా నీరు తాగితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే తగినంత నీరు తాగాలి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, రెగ్యూలర్ గా వ్యాయమం చేయడం వల్ల ఎసిడిటీని తగ్గించవచ్చు.