Health Benefits : ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు…. చిట్టి గుండె చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది!
Health Benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సంబంధిత జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. 35 ఏళ్లు దాటిన వారికి కూడా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు రావడం చూస్తూనే ఉన్నాం. 50 ఏళ్లు దాటిన వారిలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాగే మనదేశంలో మరణించే వారి సంఖ్య 20 నుంచి 25 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. 60-70 సంవత్సరాల వయస్సులో రావలసిన హార్ఎటాక్ 20-25 సంవత్సరాల వయసు మధ్య వారిలో ఎక్కువగా వస్తుంది. రకరకాల గుండెజబ్బులతో అతి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నారు.గుండె ఆరోగ్యం పాడు కావడానికి అసలు కారణలు ఏమిటో.. గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే వైట్ ప్రోడక్ట్స్‌ను ఎక్కువగా తినడం తగ్గించాలి.
వైట్ ప్రొడక్ట్స్ అంటే బియ్యం, రవ్వ, పాలిష్ చేసిన పప్పులు, మైదా వంటి పాలీస్ చేసినవి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకు పోయి బ్లోకేజెస్ ఏర్పరుస్తుంది. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడితే.. గుండెకు రక్తం సరఫరా సరిగా జరగదు. మిగిలిన అవయవాలకు ఆహారం, గాలి, నీరు సరిగా అందక మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయి. పాలిష్ చేసిన వైట్ ప్రొడక్ట్స్ తినడం వీటితో చేసిన జంక్క ఫుడ్స్, టిఫిన్, స్నాక్స్ అతిగా తినడం వలన శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది.వైట్ ప్రొడక్ట్స్ కు బదులుగా పాలిష్ చేయని బియ్యం, పప్పులు, ధాన్యాలు, మొలకలు వంటివి తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది… ఆహారం కూడా పనికి తగ్గట్టుగా తినాలి. ఎక్కువ తినడం తక్కువ పని చేయడం వలన కూడా గుండె జబ్బులు వస్తాయి… రెండవదిగా సాల్ట్.
ఆహారంలో సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త నాళాలులోకి వెళ్లి రక్తనాళాల అంటి పెట్టుకుని రక్తనాళాలను హార్డ్‌గా చేస్తుంది.దీనివల్ల రక్తనాళాల సంకోచ వ్యాకోచాలు జరగక ప్లంప్ ఇబ్బంది అవుతుంది… సాధ్యం అయినంతవరకు ఆహారంలో ఉప్పును తగ్గించడం మంచిది. ఉప్పు చాలా ప్రమాదకరమైన ఆహార పదార్థం. సాల్ట్ వల్ల హైబీపీ తో పాటు.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ 100/70,110/70,90/70 మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీసుకునే ఆహారంలో కూడా నియమాలు పెట్టుకోవడం వలన గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు. ఉదయం డ్రైఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్స్ వంటివి తీసుకుని మధ్యాహ్నం పూట పుల్కా మాత్రమే తిని, రాత్రి డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ తినాలి. ఉదయం, సాయంత్రం డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ తీసుకొని మధ్యాహ్నం ఒక్కపూట మాత్రమే ఉడికించిన ఆహారాన్ని తినాలి. ఇలా తినడం వలన గుండె జబ్బులు ఉన్న వారికి నయమవుతుంది లేని వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.