Health Benefits : పడుకునే ముందు పాలలో ఇది కలుపుకుని తాగండి.. మీలో ఊహించని మార్పు వస్తుంది..
Health Benefits : ప్రస్తుత యుగంలో అందరూ యంత్రాల్లాగా పనిచేస్తున్నారు. ఉదయాన్నే లేవగానే ఎదో ఒకటి తినడం ఆఫీస్ కు బయలుదేరడం మధ్యాహ్నం సమయంలో లంచ్ టైంలో తింటే తింటారు లేదంటే లేదు. ఇక నైట్ టైంలో పిజ్జా, బర్గర్ వంటివి తిని రోజులు గడుపుతున్నారు ప్రస్తుత తరం వారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎలాంటి హెల్త్ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవడం చాలా అవసరం. రాత్రి పడుకునే సమయంలో కొన్ని గోరు వెచ్చని పాలలో కాస్త శొంఠి పొడి కలిపి తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
శొంఠిలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గొంతునొప్పి నుంచి సైతం రిలీఫ్ ను ఇస్తుంది. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. జీర్ణక్రియ సంబంధించిన సమస్యలను ఇది నివారిస్తుంది. బాడీలోని విషయాలను బయటకు పంపించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.చాలా మందికి భోజనం సమయంలో ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. అవి తొందరగా ఆగవు. ఆ టైంలో కొస్తా శొంఠి పాలను తాగిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. జాయింట్ పెయిన్స్ ఉన్న వారు వారంలో మూడు సార్లు శొంఠి కలిపిన పాలను తాగడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
Dry ginger : ఎక్కిళ్లను ఆపడంలో..
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి మనిషి బరువు తగ్గడంలో ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఉంటే ఇన్ప్లమేటరీ లక్షణాలు మన బాడీలోని వ్యాధి నిరోదక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. ఇన్ఫెక్షన్స్ కలగకుండా కాపాడుతాయి. శొంఠి పొడి మార్కెట్ లో దొరుకుతుంది. అలా కాంకుడా ఇంట్లోనూ దీనిని తయారు చేసుకోవచ్చు. శొంఠి కొమ్ములను తెచ్చుకుని నెయ్యి లేదా నూనెలో వేగించిన తర్వాత పొడిగా తయారు చేసుకోవాలి. దీని వల్ల మంచి ఫ్లెవర్ సైతం వస్తుంది.