Health Benefits : ఈ పండు దొరికితే వదలకండి.. ఎందుకంటే ఇది వారికి చాలా మంచిది
Health Benefits : రోజ్ యాపిల్స్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ డయాబెటిస్‌ను నియంత్రించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హార్ట్ సంబందిత సమస్యలను నివారిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పేరు వినడానికి యాపిల్స్ లా ఉన్నా వాటికి పోలిక ఉండదు. జామకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం సైజిజియం జాంబోస్. మొక్క యొక్క పండు, బెరడు మరియు ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వీటిని నాటు వైద్యాలలో […]
Health Benefits : రోజ్ యాపిల్స్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ డయాబెటిస్‌ను నియంత్రించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హార్ట్ సంబందిత సమస్యలను నివారిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పేరు వినడానికి యాపిల్స్ లా ఉన్నా వాటికి పోలిక ఉండదు. జామకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం సైజిజియం జాంబోస్. మొక్క యొక్క పండు, బెరడు మరియు ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వీటిని నాటు వైద్యాలలో కూడా ఉపయోగిస్తారు.వీటిలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటుంది.
అలాగే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రోజ్ యాపిల్‌లో కేవలం 25 కేలరీలు మరియు 0.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిలో కాల్షియం, థియామిన్, నియాసిన్, ఐరన్, సల్ఫర్ మరియు పొటాషియం కూడా ఉంటాయి. సేంద్రీయ మొక్కల సమ్మేళనాల పరంగా ఇవి జంబోసిన్, బెటులినిక్ యాసిడ్ మరియు ఫ్రైడెలోలాక్టోన్ కూడా కలిగి ఉంటాయి.జాంబోసిన్ అనేది గులాబీ యాపిల్స్‌లో కనిపించే ఆల్కలాయిడ్ రకం, ఇది పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడాన్ని నియంత్రించడంలో మంచి ఫలితాలను చూపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి మరియు ఈ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది ముఖ్యమైన ఔషదం.గులాబీ యాపిల్స్ అధిక నీటిని కలిగి ఉంటుం. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
Health Benefits : డయాబెటిస్ కంట్రోల్..
అలాగే సాంప్రదాయ వైద్యంలో విరేచనాలు, పొట్ట సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. గులాబీ యాపిల్స్‌లోని పోషకాలలో సోడియం, పొటాషియం తక్కువగా ఉండి నీరు ఇతర ప్రయోజనకర సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే అథెరోస్క్లెరోసిస్ తక్కువ చేసి హార్ట్ అటాక్, స్ట్రోకుల నుండి తప్పించుకోవచ్చు.గులాబీ ఆపిల్‌లోని క్రియాశీల మరియు అస్థిర భాగాలు యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ ప్రభావాలు చర్మాన్ని వివిధ అంటురోగాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే అంటు వ్యాధుల నుండి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.