Health Benefits : ఈ మొక్క ఎక్కడా కనిపించినా వదలకండి.. అవి కరిస్తే వెంటనే విరుగుడు
Health Benefits : ఈశ్వరి వేరు, ఈశ్వరి మొక్క ఈ పేరు వినే ఉంటారు. ఇది ప్రాచిన వైద్య మూలిక మొక్క. ఉర్డూలో ఈ మొక్కను జరావాండ్ అంటారు. ఈ మొక్కకు సంస్కృతంలో పలు పర్యాయపదాలు ఉన్నాయి. నకులి, అర్కముల, గరుడ, అహిగంద, ఈశ్వర, ఈశ్వరి, నకులేష్ట, సునంద, రుద్రజాత, నాగదమణి పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కలు లోతట్టు ప్రాంతాలలోని పొదలు, కంచెలలో పెరుగుతాయి.పొదలాగా పెరిగే ఈ తీగ అన్ని ఋతువులలోను పెరుగుతూ అల్లుకొంటుంది. చాలా బారుగా ఉండే ఈ తీగలు దట్టంగా అల్లుకొంటాయి. తీగకు ఎటువంటి ముళ్లు, నూగు లేకుండా నున్నగా ఉంటుంది. ఆకులు మామూలుగా పొట్టిగా ఉండి తీగకు ఇరువైపులా ఒకదాని తరువాత మరొకటి ఉంటాయి. అకు అంచులు సాఫీగా ఉండక వంపులు కలిగి ఉంటాయి. పూవులు తెలుపు ఆకుపచ్చ లేత ఉందా రంగులో ఉంటాయి.
గరాటా ఆకారంలో ఉంటాయి. కాయలు కోలగా, షడ్భుజాకారంలో ఉంటాయి. కాయ క్రింద భాగం నుండి ఆరు గొట్టాలుగా తొడమి సాగి ఉంటాయి. గింజలు పల్చగా, రెక్కలు కలిగి ఉంటాయి.వేళ్లు చేదుగా ఉంటాయి. నాలుకకు తగిలిస్తే చురుక్కుమనిపించే గుణముంది. జీర్ణకారి, విరేచనకారి, నొప్పులను తగ్గిస్తుంది. రక్తశుద్ధి, కడుపులో పురుగులను నాశనం చేస్తోంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. గుండె బలానికి, చర్మముపై మంటల నివారణకు పనిచేస్తుంది. తరచుగా వచ్చే జబ్బులను నివారిస్తుంది. కురుపులను తగ్గిస్తుంది. కఫ, వాత రోగాలకు, కీళ్ళ సంబంధమైన వాటికి పనిచేస్తుంది. కుష్టు బొల్లి, ఇతర చర్మ రోగాలకు దివ్యంగా పనిచేస్తుంది.అలాగే అన్ని రకాల విష పురుగులు, జంతువులు కరిచినా, తేళ్ల లాంటి విషక్రీములు కుట్టినా దివ్యంగా పనిచేస్తుంది.
helth tips; విషపురుగులకు విరుగుడు మందు
అకులను కలరా నివారణకు ఉపయోగిస్తారు. పెద్ద పేగులలోని సమస్యలకు, చిన్న పిల్లలకు తరచుగా వచ్చే జ్వరాలకు ఉపయోగపడుతుంది.ఈ ఈశ్వరి ఆకులను నూరి శరీర మంటలతో బాధ పడుతున్న చోట శరీర భాగాలపైన పూసిన వెంటనే తగ్గుతుంది. అదే విధంగా విత్తనాలు శరీరమంటలు, పొడి దగ్గు, కాళ్ల నొప్పులు, పిల్లల శ్వాస రోగాలకు పనిచేస్తాయి.జ్వరం అజీర్ణం, జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఈశ్వరి మొక్క రూట్ పౌడర్ చిటికెడు గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. మొక్క యొక్క ఆకు నుండి పేస్ట్ తయారుచేసి వాపుతో ఉన్న కీళ్లనొప్పులపై మసాజ్ చేయాలి. అలాగే ఈ పేస్ట్ ను పసుపుతో కలిపి నుదిటిపై రాస్తే తలనొప్పి నుంచి ఉపషమనం పొందవచ్చు.