Health Benefits : ఈ బ్రోకలీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ బ్రోకలీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…

Broccoli : మనం రోజు వారి ఆహారంలో ఎన్నో రకాల ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకునే వారి మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుందంట. అలాగే గుండె సమస్యలు, క్యాన్సర్, బిపి తొందరగా తగ్గుతాయి. అయితే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే జింక్, సెలీనియం, విటమిన్ ఎ,సి లాంటి పోషకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి. అయితే ఈ బ్రోకలీలో పాలి ఫైనల్స్,క్వెర్సెటి న్ మరియు గ్లూకో సైడ్ ఇలాంటి పోషకాలు కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Health Benefits : ఈ బ్రోకలీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...

Broccoli : మనం రోజు వారి ఆహారంలో ఎన్నో రకాల ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకునే వారి మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుందంట. అలాగే గుండె సమస్యలు, క్యాన్సర్, బిపి తొందరగా తగ్గుతాయి. అయితే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే జింక్, సెలీనియం, విటమిన్ ఎ,సి లాంటి పోషకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి. అయితే ఈ బ్రోకలీలో పాలి ఫైనల్స్,క్వెర్సెటి న్ మరియు గ్లూకో సైడ్ ఇలాంటి పోషకాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ఇవి మధుమేహానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. మీరు ఈ బ్రోకలీని కూరగాయలు లేక సూప్ లేక సలాడ్ లాగా కూడా వాడవచ్చు. అయితే ఈ బ్రోకలీని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

డయాబెటిస్ : మధుమేహం ఉన్నవారు కచ్చితంగా ఆకుకూరలు తీసుకోవాలి. అందులో బ్రోకలీ ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. దీంతో ఊబకాయం అనేది పెరగకుండా ఉంటుంది. దీంతో డయాబెటిస్ పేషెంట్లు ఎంతో ప్రయోజనం పొందుతారు..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : ఈ బ్రోకలీలో విటమిన్ సి, జింక్ మంచి పరిమాణంలో ఉన్నాయి. అయితే ఈ బ్రోకలిని తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది..

బరువును నియంత్రిస్తుంది : ఈ బ్రోకలీ లో ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లకు మంచి మూలం అని చెప్పొచ్చు. దీని వలన పొట్ట ఎక్కువసేపు నిండున ఫీలింగ్ ఉంటుంది. మీరు బరువును నియంత్రించాలనుకుంటే తప్పకుండా బ్రోకలీ సూప్ లేక సలాడ్ ను తీసుకుంటే చాలు. మీరు డైటింగ్ చేస్తూ కూడా బ్రోకలీ ని తీసుకున్నట్లయితే ఊబకాయం అనేది తగ్గుతుంది..

కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది : ఈ బ్రోకలీ ని తీసుకోవడం వలన కాలేయం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీ క్యాన్సర్, హైపాటో ప్రొటెక్టివ్, ఎలిమెంట్స్ అనేవి కాలేయాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచటంలో సహాయం చేస్తాయి. ఈ బ్రోకలీ అనేది శీతాకాలం సీజన్లో దొరుకుతుంది. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది..

Broccoli ఈ బ్రోకలీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

Broccoli : ఈ బ్రోకలీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…

ఎముకలను బలపరుస్తుంది : బ్రోకలీ ని తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది శరీరంలో ఉన్న కాల్షియం లోపాన్ని కూడా నియంత్రిస్తుంది.ఈ బ్రోకలీలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఎంతో బలంగా తయారు చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది