Health Tips : వింటర్ సీజన్లో ఈ గింజలను వేయించుకొని మరి తింటారు… కారణం తెలిస్తే ఎ ప్పటికి వదలరుగా…?
ప్రధానాంశాలు:
Health Tips : వింటర్ సీజన్లో ఈ గింజలను వేయించుకొని మరి తింటారు... కారణం తెలిస్తే ఎ ప్పటికి వదలరుగా...?
Health Tips : ఈ రకపు గింజలను తీసుకోవడం వలన దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు తెలిపారు. అవిసె గింజల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజల్లో పోషక విలువలు చాలా ఉంటాయి. యవసగింజల్లో విటమిన్స్ B1, ఒమేగా, ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, పోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే అవిసె గింజలను వేయించుకొని తినడం వలన శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాలను తొలగించుటకు మంచి ఔషధంగా చేస్తుందని వైద్య నిపుణులు సలహా ఇచ్చారు. మరి అది ఎలానో తెలుసుకుందాం…
ఈ అవిసె గింజల్లో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు ఇన్సులిన్ ద్వారా గ్లూకోస్ ను పెంచి రక్తంలోని షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను వేయించి, ఉదయం,సాయంత్రం తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య పూర్తిగా దగ్గు ముఖం పట్టుతుంది అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒక స్పూన్ అవిసె గింజలు రోజు తింటే ఈ గింజల్లోని విటమిన్ ఈ, చర్మంపై రాషెస్, మొటిమలు వంటివి నివారించబడతాయి. అలాగే చర్మంలో ఉండే మృత కణాలు తొలగిపోయి, కాంతివంతంగా మెరుస్తుంది. వేయించిన అవిసె గింజలు ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా ఉపకరిస్తాయి అని వైద్య నిపుణులు సలహా ఇచ్చారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా నియంత్రించబడుతుంది. ఇది ప్రతిరోజు వినియోగిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. షుగర్ ఉన్న వారికి ఇది ఒక దివ్య ఔషధం. అవిసెగింజలలో ఫైబర్ ఉండడం వల్ల, అజీర్ణం చేసినప్పుడు వేయించిన ఆవిసె గింజలు పొడిని తీసుకోవచ్చు . వీటిని తినడం వలన కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలను వేయించిన తర్వాత పొడి చేసుకొని వాటిని వేడి నీటిలో కలుపుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది.
అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ కొవ్వులను కరిగిస్తుంది. తద్వారా హార్ట్ ఎటాక్ నుంచి గుండెను కాపాడుకోవచ్చు. అలాగే, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, హైపోథైరాయిడ్ వల్ల వచ్చే నొప్పులను అవిసె గింజల తీసిన నూనెను, జెల్ మసాజ్ చేసి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అవిస గింజలను వేయించి తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. ఇది మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాక, ఎక్కువగా నిద్రించుటకు సహాయపడుతుంది. కొంతమంది నాన్ వెజ్, కోడిగుడ్లు అస్సలు తినరు, వంటి వారు నాన్ వెజ్ ప్లేస్ లో ఇవేంచినా అవిస గింజలను తీసుకుంటే నాన్ వెజ్, కోడిగుడ్డులో ఉండే విటమిన్స్ లభిస్తాయి. అవిసె గింజలను నూనెగా తాగిన, జుట్టుకి అప్లై చేసిన, జుట్లు కుదుళ్ళు బలవంతంగా మారుతాయి. అంతేకాదు అవిసె గింజలను నూనెను జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య జుట్టు రాలడం వంటివి కూడా తగ్గుతాయి. చలికాలంలో వచ్చే జలుబులు, దగ్గు వంటి అంటూ వ్యాధులు కూడా ప్రబలకుండ కాపాడతాయి. ఎటువంటి అంటువ్యాధుల నుంచి అయినా మన శరీరాన్ని కాపాడడానికి గింజల్ని తినమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అవిస గింజలలో ఒమేగా 3, అమై నో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ విత్తనాలు మహిళలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో వేడిని పుట్టిస్తాయి. గింజలని మెత్తగా పొడి చేసి, చపాతి పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడుకోవచ్చు. ఈ అవిస గింజల్లో పోషకాలు హార్మోన్లు సమన్వయం చేయటంలో, నెలసరి క్రమానికి, క్యాన్సర్ కారకాలతో పోరాటం చేయడంలోనూ కీలకంగా పని చేస్తాయి. లిజ్ఞాన్స్ మోనోఫాస్ దశకు చేరుకున్న మహిళలకు క్యాన్సర్ బారిన పడకుండా కూడా కాపాడతాయి. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపకరిస్తాయి.
ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే అవిసె గింజలు అతిగా కూడా తినవద్దు, అతీగా తినడం వలన చర్మంపై ర్యాషెస్ ఎక్కువ అయ్యి, కూడా ఎక్కువ అవుతుంది. కావున కొద్దిగా మోతాదులో తినాలి. తక్కువ మోతాదులో వినియోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజలను మితిమీరి కూడా తినవద్దు. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వీటిలో ఫైటిక్ యాసిడ్, సైనోజెనిక్ గ్లైకోసైడ్స్, యాంటీ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి పోషకాలు శరీరంలో శోషణ చెందకుండా అడ్డుకుంటాయి. గింజలు ఎక్కువగా తీసుకుంటే కొందరులు వాంతులు చర్మం మీద దద్దుర్లు, ముఖం వాపు, లాంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. కావున అవసె గింజలను తొమ్మిది నుంచి 10 గ్రాములు లేదా ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకుంటే రోజుకు ఆల్ఫా లీలోలీక్ యాసిడ్ శరీరానికి అందుతుంది. రోజుకు మొత్తంలో ఒకటి లేదా రెండు స్పూన్ల అవిస గింజలు పొడి తీసుకోవచ్చు. లేదా ఒక టేబుల్ స్పూన్ లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకోవచ్చు. Health Tips blood sugar control flaxseeds