Chamomile Tea : చామంతి టీతో ఎన్నో ప్రయోజనాలు.. రాత్రి తాగితే సర్వరోగాలు మాయం..!
ప్రధానాంశాలు:
Chamomile Tea : చామంతి టీతో ఎన్నో ప్రయోజనాలు.. రాత్రి తాగితే సర్వరోగాలు మాయం..!
Chamomile Tea : చామంతి టీతో ఎన్నో ప్రయోజనాలు.. రాత్రి తాగితే సర్వరోగాలు మాయం..!
Chamomile Tea : చాలామంది టీలు తాగకుండా ఉండలేరు. అయితే టీ తాగితే చాలా వరకు అనారోగ్యమే అని డాక్టర్లు చెబుతున్నారు. అలా అని అన్ని టీలు అనారోగ్యం అనికాదు. కొన్ని టీలు తాగితే ఉపయోగాలు కూడా ఉంటాయి. అందులో చెప్పుకోవాల్సింది మాత్రం చామంతి టీ. దీని గురించి చాలామందికి తెలియదు. కానీ దీన్ని తాగితే మాత్రం చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంగ్జయోలిటిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తాగడం వల్ల సుఖవంతమైన నిద్ర పడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో బాగా సాయం చేస్తుంది. దాని వల్ల ఈజీగా నిద్ర పడుతుంది.
Chamomile Tea : కండరాల నొప్పి మాయం..
అంతే కాకుండా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం త్వరగాజీర్ణం అయ్యేలా చూస్తుంది. కడుపు నొప్పి, అజీర్ణం, వాంతులు, విరేచనాలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ టీలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది తలనొప్పి, పీరియడ్స్, కండరాల నొప్పులకు అద్భుతమైన చికిత్సగా పని చేస్తుంది. దాంతో పాటు ఇది నెలసరి నొప్పి, అతీర్తి సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీన్ని గనక రాత్రి సమయంలో తాగితే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజుల్లో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ టీని రాత్రితాగితే మాత్రం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో మెండుగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి. చామంతిలోని ఫ్లైవనాయిడ్స్ ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని డాక్టర్లే చెబుతున్నారు.
అంతే కాకుండా నిత్యం టెన్షన్లకు గురయ్యే వారు గనక దీన్ని తాగితే వారికి ఎలాంటి టెన్షన్లు దరి చేరకుండా హాయిగా ఉంటారని చెబుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. దాని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అంతే కాకుండా అజర్ణ సమస్యలను తగ్గిస్తుంది కాబట్టి పొట్ట రాకుండా చూడటంలో సాయం చేస్తుంది. దాంతో పాటు రోజువారీ పని ఒత్తిడులకు దూరంగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.