Chukkakur : చుక్కకూర ఎక్కువగా తింటున్నారా… అయితే మీ ఆరోగ్యంలో కలిగే మార్పులు తెలుసుకోండి….?
ప్రధానాంశాలు:
Chukkakur : చుక్కకూర ఎక్కువగా తింటున్నారా... అయితే మీ ఆరోగ్యంలో కలిగే మార్పులు తెలుసుకోండి....?
Chukkakur : ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆకుకూరలో ఒకటైన ఆకు కూర చుక్కకూర. ఈ చుక్క కూర చూసేందుకు కాస్త బచ్చలి, పాలకూర దగ్గరగా ఉంటుంది. ఈ చుక్క కూర రుచిలో చాలా పుల్లగా ఉంటుంది. దీన్ని పుల్లటి బచ్చలి కూర అని కూడా అంటారు. మీ పుల్లగా ఉన్నప్పటికీ చుక్క కూర వేడి శరీర తత్వం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చుక్క కూరలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు ఉన్నవారు చుక్కకూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా చుక్కకూరను తీసుకుంటే ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా చుక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది. గ్యాస్,ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం అంటే సమస్యలు చుక్కకూర తగ్గిస్తుంది. చుక్కకూరలో రోగనిరోధక శక్తి పెంచే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల తరచూ వచ్చే వ్యాధుల బారిన నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. వైరస్, ఇన్ఫెక్షన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ చుక్క కూరలో ఏ’ విటమిన్ ఉంటుంది. కావున కంటి చూపు మెరుగుపరుస్తుంది. రే చీకటి సమస్యతో బాధపడే వారికి చుక్కకూర తినడం వల్ల క్రమం క్రమంగా సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చుక్క కూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కావున ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయటంతో పాటు, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిని కూడా రాకుండా చేయవచ్చు.
చుక్కకూర గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ చుక్క కూర యొక్క గుణాలు రక్తనాళాలలు మూసుకుపోకుండా కూడికలను సరి చేయుటకు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటుతో బాధపడేవారు కచ్చితంగా ఈ చుక్కకూరను తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటే రక్తనాళాలు వేకొచ్చింది బీపీ అదుపులోకి వస్తుంది.
క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. రొమ్ము క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్స్ వంటివి రాకుండా చుక్కకూర నివారిస్తుంది. అలాగే రక్తహీనతను తగ్గించడంలో కూడా చుక్కకూర చాలా బాగా ఉపకరిస్తుంది. దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తదుపరి రక్తహీనత తగ్గుతుంది. అలాగే చుక్కకూరను తినడం వల్ల రక్తంతో కూడిన విరోచనాలు, జిగురు విరోచనాలు వ్యాధుల్లో కూడా పనిచేస్తుంది. మొలలు వ్యాధి ఉన్నవారు కూడా ధైర్యంగా ఈ చుక్కకూరను తినవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఉన్న విష దోషాలన్నీ పోగొట్టడానికి చాలా బాగా ఉపకరిస్తుంది ఈ చుక్క కూర. అధిక వేడి వలన పురుషులు జీవ కణాలు ఎక్కువ సంఖ్యలో చనిపోయి, సంతానం కలగని వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించడం వలన సంతానోత్పత్తికి అవసరమయ్యే కణాలను వృద్ధి చేoదిస్తుంది. అలాగే వాంతుల్ని అరికడుతుంది. ఈ చుక్క కూర ఆకుని బాగా నమిలి బుగ్గన ఉంచితే పంటి పోటు తగ్గిపోతుంది. చూశారు కదా ఈ చుక్క కూర వల్ల ఎన్ని లాభాలో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చుక్క గురించి తినడానికి ప్రయత్నం చేయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.