Cinnamon Tea : దాల్చిన చెక్క టీ లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… అస్సలు వదలరు…??
ప్రధానాంశాలు:
Cinnamon Tea : దాల్చిన చెక్క టీ లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే... అస్సలు వదలరు...??
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మరియు పోషకాలు దాగి ఉన్నాయి. ఈ దాల్చిన చెక్క యొక్క రుచిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. దీని సహాయంతో ఎన్నో రకాల వంటకాల యొక్క రుచి అనేది ఎంతో పెరుగుతుంది. అయితే ఈ గరం మసాలాలో కార్బోహైడ్రేట్లు మరియు మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్ లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందుకే దాల్చిన చెక్కను తీసుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ మీరు దీనిని ఆహారంలో తీసుకోకపోయినా దాల్చిన చెక్కను వేడి నీటిలో మరిగించి లేక దాల్చిన చెక్క పొడి వేడి నీటిలో వేసుకొని టీ లా చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. అలాగే మనం ప్రతిరోజు ఒక గ్లాస్ దాల్చిన చెక్క నీరు తాగితే మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cinnamon Tea దాచుచక్క నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది : ఈ దాల్చిన చెక్కలో సహజమైన జీర్ణ క్రియ లక్షణాలు దాగి ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం వలన గ్యాస్ మరియు ఉబ్బరం, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి..
2. జ్ఞాపకశక్తి బలపడుతుంది : ప్రతిరోజు మీరు దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే అది మీ మెదడు యొక్క పనితీరుడు మెరుగుపరుస్తుంది. అలాగే మీ ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ఇకపోతే మీ జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా మేలు చేస్తుంది. అంతేకాక అల్జీమర్ సమస్యను కూడా దూరం చేస్తుంది..
3. గుండె ఆరోగ్యం : ప్రతిరోజు కచ్చితంగా దాల్చిన చెక్క నీటిని తాగే వారిలో సిరల్లో చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి కూడా మేలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది . ఇకపోతే గుండె పోటు లాంటి సమస్యలను తగ్గించడం లో కూడా
హెల్ప్ చేస్తుంది…
4. రోగనిరోధక శక్తి పెరుగుతుంది : ఈ దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేస్తుంది. అలాగే ఇది జలుబు మరియు దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది…
5. చర్మానికి మేలు చేస్తుంది : ఈ దాల్చిన చెక్క నీరు అనేది మన చర్మ ఆరోగ్య నికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మంటను తగ్గించడం మరియు ఎంతో ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహించడం వలన చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మొటిమలతో పాటుగా చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది…
దాల్చిన చెక్క టీ తయారు చేసే విధానం : దాల్చిన చెక్క టీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క లేక పొడిని వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వడకట్టుకొని తాగాలి. దీనిలో రుచికి తగినట్టుగా నిమ్మరసం లేక తేనెను కూడా కలుపుకొని తాగొచ్చు…