Cinnamon Water : ఈ నీటిని పరిగడుపున తీసుకుంటే చాలు…ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!
ప్రధానాంశాలు:
Cinnamon Water : ఈ నీటిని పరిగడుపున తీసుకుంటే చాలు...ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లే...!
Cinnamon Water : మన భారతీయ వంటకాలలో ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి. అలాగే ఆయుర్వేద ఔషధాలలో కూడా ఈ దాల్చిన చెక్క ఒకటి. అందువల్ల ఈ దాల్చిన చెక్కను దివ్య ఔషధంగా భావిస్తారు. ఈ దాల్చిన చెక్క ఆహారానికి సువాసనతో పాటు రుచిని కూడా ఇస్తుంది. అయితే ఈ దాల్చిన చెక్క నీటిని రోజు తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే పరిగడుపున ప్రతినిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ దాల్చిన చెక్క నీటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ దాల్చిన చెక్కలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉండడం వలన ఇది దాల్చిన చెక్క నీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది…
1.దాల్చిన చెక్క నేటిని ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాక గ్యాస్, అజిర్తి సమస్యలను కూడా నివారిస్తుంది.
2. శరీర బరువును కంట్రోల్లో ఉంచాలన్నా మరియు తగ్గించాలి అనుకున్న వారికి కూడా ఈ దాల్చిన చెక్క వాటర్ ఎంతో మేలు చేస్తుంది. ఈ దాల్చిన చెక్క నీరు అనేది ఆకలిని నియంత్రించడానికి మరియు కొవ్వు ను కరిగించటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
3. ప్రతినిత్యం పరగడుపున దాల్చిన చెక్క నీటి ని తీసుకోవటం వలన ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి కూడా ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక మెదడుకు సంబంధించిన అల్జిమార్స్ సమస్యను కూడా నియంత్రిస్తుంది.
4. దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబియన్ మరియు యాంటీ వైరస్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.
5. ఈ దాల్చిన చెక్క నీరు శరీరంలో మంటను తగ్గించడం వలన చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయపడుతుంది.
6. ఈ దాల్చిన చెక్క నీటిని ప్రతినిత్యం తీసుకోవడం వలన రక్తనాళాలలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది.
ఈ దాల్చిన చెక్క నీటిని ఉదయనే పరిగడుపున అల్పాహారానికి ముందు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాకాకుండా రాత్రి పడుకునే ముందు తీసుకున్న సరే మేలు జరుగుతుంది. ఈ దాల్చిన చెక్క నీటిలో ఒక స్పూన్ తేనె మరియు నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయి…