Diabetes : డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్లు త్రాగవచ్చా.. లేదా..?
Diabetes : డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా చాలామంది బాధపడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో మార్పులు, పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే దీని ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. కానీ చాలా సార్లు డయాబెటిస్ బాధితులు కొన్ని వస్తువుల వినియోగంపై సందేహాలు ఉంటాయి. వారు దానిని తినాలా వద్దా అని ఆలోచిస్తారు. ఒకవేళ తింటే చక్కెర స్థాయి పెరుగుతుందేమో అని ఆలోచిస్తారు. డయాబెటిక్ బాధితులలో కొబ్బరినీళ్ళ వినియోగం గురించి ఆందోళన సందేహం రెండు ఉంటాయి. కొబ్బరినీళ్లు త్రాగడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరినీళ్ళు త్రాగవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం కొబ్బరి నీళ్లలో సున్నా క్యాలరీలు ఉంటాయి. ఇవి కాకుండా ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు కొబ్బరినీళ్ళలో ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవి. కొబ్బరినీరు రుచిలో తీపిగా ఉన్నప్పటికీ దానిలో కృత్రిమ స్వీటెనర్ ఉపయోగించబడదు. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు త్రాగడం వల్ల షుగర్ స్థాయి పెరగదు. మనందరికీ తెలిసిందే కొబ్బరి నీళ్లు తాగితే అనేక వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా షుగర్ వ్యాధి బాధితులు చక్కెర స్థాయి నియంత్రణలో ఉండాలంటే కొబ్బరి నీళ్లను త్రాగవచ్చు.
నిజానికి కొబ్బరి నీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీని వలన శరీరంలో ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మధుమేహ బాధితులకు కొబ్బరి నీళ్లు ప్రయోజనకరమని చెప్పవచ్చు. తాజా అధ్యయనం ప్రకారం డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్లు త్రాగవచ్చని తెలిపారు. అయితే కొబ్బరి నీళ్లల్లో ప్రక్టోజ్ తోపాటు తీపి కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫ్రక్టోజ్ అనేది పండ్లు, కూరగాయలు, తేనెలో ఉండే సహజ చక్కెర. కాబట్టి మధుమేహం బాధితులు కొబ్బరినీళ్ళను మితంగా తీసుకోవాలి. డయాబెటిస్ బాధితులు రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ కొబ్బరి నీళ్లను త్రాగకూడదని వైద్యనిపుణులు సూచించారు. కాబట్టి మితంగా త్రాగితే ఎటువంటి సమస్య ఉండదు.