Falsa Health Benefits : ఫాల్సా పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Falsa Health Benefits : ఫాల్సా పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!!

Falsa Health Benefits : పకృతి మనకు కొన్ని రకాల పండ్లను బహుమతిగా ఇస్తుంది. ఇవి తినటానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఒక పండు ఫాల్సా ఇది మధ్య భారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండు చిన్న రేగు పండు లాగా కనిపిస్తుంది. దీని రుచి అనేది తీపి మరియు పుల్లగా కూడా ఉంటుంది. దానిలోని పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని పోషకాల పవర్ హౌస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,7:00 am

Falsa Health Benefits : పకృతి మనకు కొన్ని రకాల పండ్లను బహుమతిగా ఇస్తుంది. ఇవి తినటానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఒక పండు ఫాల్సా ఇది మధ్య భారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండు చిన్న రేగు పండు లాగా కనిపిస్తుంది. దీని రుచి అనేది తీపి మరియు పుల్లగా కూడా ఉంటుంది. దానిలోని పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని పోషకాల పవర్ హౌస్ అని కూడా అంటారు. దీని వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఫాల్సా పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాక మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ లాంటి ఎన్నో పోషకాలు దీనిలో ఉన్నాయి. ఫాల్సా ప్రతిరోజూ తీసుకోవటం వలన వీటిలో ఉండే ఫెనోలిక్ యాంటోసినిన్స్ లాంటి యాక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రల్ చేయటంతో పాటుగా ఆక్సిడేటి వ్ స్ట్రెస్ ను నియంత్రించి హృద్రోగాలు,క్యాన్సర్,మధుమేహం లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంచుతుంది. డయాబెటిక్ రోగులకు ఫాల్సా పండు చాలా మేలు చేస్తుంది.

ఫాల్సా పండు లో తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వలన దాని వినియోగం రక్తంలోనే చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది మాత్రమే కాకుండా పాలీఫెనల్ యాంటీ ఆక్సిడెంట్ లు కూడా దీనిలో ఉన్నాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు చాలా ఉత్తమమైనది. ఫాల్సా లో నీరు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో దీనిని తాగటం వలన చాలా ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. దీనిని తీసుకోవటం వలన శరీరం చల్లగా కూడా ఉంటుంది. ఈ ఫాల్సా పండు లో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో పాటుగా సోడియం కూడా తక్కువగా ఉండటంతో బీపీని నియంత్రిస్తుంది. దీనిని తీసుకున్నట్లయితే బీపీ కూడా అదుపులో ఉండటంతో పాటు హృద్రోగ ముప్పు అనేది తగ్గుతుంది. ఫాల్సా పండులో కాల్షియం కూడా ఉండటం వలన ఎముకలను బలంగా చేస్తుంది. ఇది ఎముకల సాంద్రతను కూడా ప్రోత్సహిస్తుంది. ఫాల్సా లో ఉన్నటువంటి యాంటీ ఇన్ ఫ్ల మెంటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు మరియు బోన్ ఎముకల వ్యాధి పరిస్థితు ల్లో ఎముకలలో తీవ్రమైన నొప్పిని కూడా తగ్గించడంలో ఎంతో సహాయం చేస్తుంది.

కీళ్ల కదలికలను కూడా పెంచడంలో సహాయం చేస్తుంది… ఫాల్సా పండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన శరీరంలో క్యాన్సర్ నిరోధక ఏజెంట్గా పని చేస్తుంది. దీని వినియోగం ద్వారా క్యాన్సర్ ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరాన్ని బ్రెస్ట్ మరియు లివర్ క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది. ఫాల్సా పండులో ఉన్న ఫైటోకెమికల్ సమ్మేళనాలు శ్వాసకోస సమస్యలు తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తాయి. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్, ఊబకాయం ప్రమాదాలను కూడా తగ్గించటంలో సహాయం చేస్తుంది. ఫాల్సా పండులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా ఉండటంలో సహాయం చేస్తుంది. ఫాల్సా పండులో పొటాషియం మంచి మొత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. ఫా ల్సా పండు లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని వినియోగించడం వలన రక్తహీనత చికిత్సలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్ మీ శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది