Health Benefits : ఈ పీచును పొరపాటున కూడా పడేయకండి… దీని లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ పీచును పొరపాటున కూడా పడేయకండి… దీని లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…

 Authored By anusha | The Telugu News | Updated on :28 June 2022,5:00 pm

Health Benefits : మొక్కజొన్న ను మన భారతీయులు ఎక్కువగా పండిస్తారు. ఇవి చాలా చవకగా దొరుకుతాయి. అలాగే మంచి పోషకాలు ఉన్న బలమైన ఆహారం. కొందరు మొక్కజొన్న లను కాల్చుకొని తింటారు, మరికొందరు ఉడికించుకోని తింటారు. వీటినుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లెక్స్ లాంటివి తయారు చేస్తారు. లేతగా ఉన్న కంకులతో కొందరు బూరెలు చేసుకుంటారు. అలాగే కొందరు బేబీ కార్న్ తో కూరలు కూడా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా చేసుకుంటారు. అలాగే గింజల నుండి నూనెను కూడా తీస్తారు. ఈ మొక్కజొన్న కంకులతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే మొక్కజొన్న పీచుతో కూడ చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.. చాలా మందికి తెలియక మొక్క జొన్న పీచు లను పడేస్తుంటారు.

మొక్కజొన్న పీచులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, సి మరియు కే వంటి విలువైన పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకొని తాగితే ప్లేవనాయిడ్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీ లో అవయవాలు పనితీరును మెరుగుపరుస్తుంది. మొక్కజొన్న లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. యూరిన్ లో ఉండే బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న అదనపు నీరు ను, వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ మొక్క జొన్న పీచు సహాయపడుతుంది. అలాగే మొక్కజొన్న పీచు బ్లడ్ లోని కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని త్రాగడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనకు ఏదైనా గాయం తగిలితే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది విటమిన్ కె. ఈ విటమిన్ కె ఈ మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది.

Health Benefits of corn silk

Health Benefits of corn silk

అధిక బరువు ఉన్నవారు మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం దక్కుతుంది. అయితే మొక్కజొన్న పీచు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి దూరని డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. అయితే ఇప్పుడు మొక్కజొన్న పీచుతో టీ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని కొన్ని మొక్కజొన్న పీచు లను వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత మరొక గిన్నెలోకి ఇలా మరిగించిన నీళ్లను వడకట్టుకోవాలి. తరువాత ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగాలి. అలాగే ఈ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు. దానిని వారం రోజుల దాకా వాడుకోవచ్చు. మొక్కజొన్న పీచుతో ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఎప్పుడైనా వీటిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొక్కజొన్నలనే కాదు పీచును కూడా వాడుకోండి.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది