Curd : ఈ పొడిని పెరుగులో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు…!
ప్రధానాంశాలు:
Curd : ఈ పొడిని పెరుగులో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు...!
Curd : జీలకర్ర మన ఇంట్లో వాడే నిత్యపదార్థాలలో ఒకటి.. ఈ చిలక బరువు తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జరిపిన పరిశోధనలు చాలా సులువుగా అధిక బరువును కేవలం జీలకర్ర ద్వారా తగ్గించవచ్చని నిరూపితమైంది. అయితే మన భారతీయులకు వేడి చేసే లక్షణాలు ఎక్కువ. అందుకే పెరుగు, జిలకర కాంబినేషన్తో క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. అధిక బరువును తగ్గించుకోవచ్చు..ఒక కప్పు పెరుగులో ఒక చెంచా లేదా మూడు గ్రాముల జీలకర్ర పొడిని వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక గంట తర్వాత తినాలి. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం టీ తాగిన ఒక గంట తర్వాత తినాలి. రోజంతా బాగా బిజీగా ఉండేవారు రోజుల్లో ఎప్పుడైనా తినొచ్చు.
ఇంకా అధిక బరువు సమస్యలు ఎదుర్కొనేవారు జీలకర్ర నీటిని తాగాలి. ముందుగా వేడి నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా తేనె కలిపింది చేసుకొని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 10 నుండి 15 రోజులు ఆచరిస్తే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. జీలకర్ర శరీరంలో మెటపాలిజం క్రమబద్ధకిరం చేస్తుంది. రక్తంలోని కొవ్వుని అద్భుతంగా తగ్గిస్తుంది. జీలకర్రతో ముఖ్యంగా మన శరీరంలోని ట్రైన్ 25% తగ్గుతుంది. జీలకర్రతో రక్తంలో కొలెస్ట్రాల్ కరగడం వల్ల షుగర్ వ్యాధి గుండెకి సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. అధిక బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే జీలకర్ర తినే విధంగా తింటే మరియు వాడే విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ఈ జీలకర్రతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి.
జీలకర్ర పొడిని పెరుగులో కలుపుకొని తింటే కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు దీంతో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. పెరుగులో నల్ల ఉప్పు ని కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. పెరుగులో చక్కెర వేసుకుని తింటే శరీరానికి వెంటనే శక్తి చేకూరడమే కాకుండా మూత్ర సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాముని ఒక కప్పు పెరుగులో కలుపుకొని తింటే దంత సమస్యలు తగ్గించుకోవచ్చు… అలాగే నల్ల మిరియాల పొడిని పెరుగులో కలుపుకుని తీసుకోవడం వలన మలబద్ధక సమస్యలు ఉండవు.