Dark Choclates : చాక్లెట్లు అధికంగా తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dark Choclates : చాక్లెట్లు అధికంగా తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Dark Choclates : చాక్లెట్లు అధికంగా తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే...!

Dark Choclates : చాక్లెట్ అనే పదం వినగానే పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఈ చాక్లెట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలే కాదు పెద్దలు కూడా చాక్లెట్లు ఇష్టంగా తినేవారు ఉన్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువగా చాక్లెట్లను ఇష్టపడతారు. అయితే చాక్లెట్ తినడం మంచిదేనా.. ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.. పిరియడ్స్ టైం లో మహిళలు ఎక్కువగా కోరుకునే ఆహారాల్లో ఐస్ క్రీమ్తో పాటు చాక్లెట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ చాక్లెట్ పీరియడ్స్ నొప్పులను తగ్గిస్తుంది..ఎందుకంటే దీనిలో ఎక్కువగా కోకో బీన్స్ ఉంటాయి.

కాబట్టి ఇది ఫ్లేవర్లకు గొప్ప మూలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా చాక్లెట్లు తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవ నాయిడ్స్ శరీరంలో ధమనులు ల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు. మీ పిల్లలు లెక్కల్లో వీక్ గా ఉంటే ఒక చాక్లెట్ ఇచ్చి చూడండి.. ఇందులో కేఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటాయి.

ఇవి మెదడుకు రక్తప్రసరణ పెంచుతాయి. పిల్లలకు ప్రతిరోజు డార్క్ చాక్లెట్లు తినిపిస్తే వాళ్ల బ్రెయిన్ చాలా షార్ప్ పనిచేస్తుంది.. చాలామందికి చదివిన.. ఏం చేసినా ఒక్కొక్కసారి గుర్తు ఉండడం లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా చాక్లెట్లు తినడం వల్ల అల్జీమర్ లాంటి వ్యాధులు తగ్గుతాయి.. ప్రతిరోజు ఒక చాక్లెట్లు తినడం వలన శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.. అయితే ఈ చాక్లెట్ లను రోజుకి ఒకటి రెండు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు…

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది