Health Benefits : కరివేపాకు నానబెట్టిన నీటిని ప్రతిరోజు తాగితే… ఊహకందని ప్రయోజనాలు మీ సొంతం…!!
Health Benefits : దాదాపు గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పెరటి మొక్కలలో కరివేపాకు ఒకటి. అయితే ఇది వంటలకు రుచి ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యని కి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే కరివేపాకులో విటమిన్ ఏ సి ఇ ఎక్కువగా ఉంటాయి. అంతేకాక దీనిలో ఐరన్ మరియు కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే చెడు కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాక ఉదయాన్నే పరగడుపున ఈ కరివేపాకు నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి పూర్తి మద్దతు ఇస్తుంది అని అంటున్నారు. అలాగే కరివేపాకు నీటిని పరగడుపున తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం…
కరివేపాకు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వలన షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు కూడా ఈ రసాన్ని తాగితే చాలా మంచిది. అలాగే కరివేపాకులో యాంటీ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కాలేయంలో ఉండే ట్యాక్సీన్ లను ఈజీగా బయటకు పంపిస్తాయి. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగితే కాలేయ సమస్యలు కూడా రాకుండ ఉంటాయి. ఇకపోతే కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి ఎంతో బలంగా చేస్తాయి. అంతేకాక పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా మనల్ని కాపాడతాయి. అలాగే కరివేపాకు రసం తాగటం వలన కంటి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ కరివేపాకు రసాన్ని ఉదయాన్నే తాగితే కంటి సమస్యలకు కూడా చాలా వరకు తగ్గిపోతాయి…
ఉదయాన్నే పరగడుపున కరివేపాకు రసం తాగితే జీర్ణ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అయితే ఈ నీరు అనేది కడుపులో జీర్ణ స్రావాల ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నీటిని తాగడం వలన కడుపు ఉబ్బరం మరియు అజిర్తి లాంటి సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేకాక జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గొచ్చు అని అంటున్నారు నిపుణులు. మీరు కరివేపాకు రసం తాగితే ఆ రోజంతా శక్తి తో మరియు ఉత్సాహంతో ఉంటారు. అలాగే కరివేపాకులో ఉండే యాక్సిడెంట్లు కణలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఈ రసాన్ని తాగటం వలన ముడతలు కూడా మాయం అవుతాయి. అలాగే డార్క్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయి. ఈ రసాన్ని తాగటం వలన జుట్టు కూడా ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు ములాలను దృఢంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ రసం జుట్టు రాలడన్ని కూడా నియంత్రిస్తుంది…