Drinking Water : పరగడుపున మంచి నీళ్లు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలిస్తే అస్సలు ఆగరు..!
Drinking Water : చాలామంది ఉదయం లేవగానే కాసిన్ని నీళ్లు తాగుతారు. ఎందుకంటే.. రాత్రి పడుకున్న తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. మధ్యలో లేచి వాటర్ తాగేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి.. 7 నుంచి 8 గంటలు కంటిన్యూగా నిద్రపోయాక.. లేవగానే దాహం వేస్తుంది. దీంతో చాలామంది లేవగానే లీటర్ నీళ్లు అయినా తాగుతారు. దాహం తీరేవరకు తాగుతారు. కొందరైతే ముఖం కడుక్కోకుండా నీళ్లు తాగకూడదని.. దాహం అయినా కూడా ముఖం కడుక్కున్నాకే నీళ్లు తాగుతారు. అయితే.. ఉదయం లేవగానే కడుపు నిండా నీళ్లు తాగాలట. అలా తాగితేనే మంచిదట. లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు.
లేవగానే మంచి నీళ్లు అనగానే.. మనకు వంద డౌట్లు వస్తాయి. లేవగానే అంటే.. ముఖం కడుక్కొని తాగాలా? ముఖం కడుక్కోకుండా తాగాలా? లేక ముఖం కడుక్కున్నాక.. ఏదైనా తిన్నాక తాగాలా? మంచినీళ్లకు బదులు వేరే ఏదైనా తాగొచ్చా? ఇలా రకరకాల డౌట్లు వస్తుంటాయి. వాటన్నింటికీ సమాధానమే ఈ కథనం.
Drinking Water : మంచినీళ్లు ఎప్పుడు తాగితే మంచిది
లేవగానే అంటే లేవగానే మంచి నీళ్లు తాగాలి. లేవగానే అంటే.. లేచినాక.. ఓ గంట తర్వాతో.. లేదా టిఫిన్ తిన్నాకో లేదా ముఖం కడుక్కున్నాకో కాదు. లేవడంతోనే ఒక్క 5 నిమిషాల గ్యాప్ ఇచ్చి.. కడుపు నిండేంత వరకు మంచి నీళ్లు తాగితే.. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలు నయం అవుతాయి. ఉదయాన్నే లేవగానే నిత్యం ఒక లీటర్ నీళ్లు తాగితే.. ఒక వంద రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ముందు శరీరంలోని విష పదార్థాలన్నీ.. మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. అయితే.. మంచినీళ్లు తాగగానే వెంటనే వ్యాయామం చేయడం, నడవడం, పరిగెత్తడం లాంటివి చేయొద్దు. మంచినీళ్లు తాగిన ఓ 10 నిమిషాల తర్వాత వ్యాయామం చేయొచ్చు.
అయితే.. ఎన్ని నీళ్లు తాగాలి? అనేదానిపై ఎవ్వరూ ఏం చెప్పలేదు కానీ.. లేవగానే కడుపు నిండేంత వరకు అది ఒక లీటర్ కావచ్చు.. ఒక గ్లాస్ కావచ్చు.. రెండు గ్లాసులు కావచ్చు. ఎవరికి తోచినంత వాళ్లు నీళ్లు తాగితే.. శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. పరగడుపున మంచి నీళ్లను తాగితే.. పేగులు శుభ్రం అవుతాయి. మలబద్ధకం సమస్య రాదు. ఫ్రీగా మోషన్ అవుతుంది. కిడ్నీలు శుభ్రం అవుతాయి. కాలేయం కూడా శుభ్రపడుతుంది. అలాగే… జీర్ణాశయం కూడా శక్తిమంతంగా తయారవుతుంది. తాగే నీళ్లు కాస్త గోరు వెచ్చగా ఉంటే.. బరువు కూడా తగ్గొచ్చు. చూశారు కదా.. ఉదయం లేవగానే కాసిన్ని మంచినీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో. ఇప్పటి నుంచి రోజూ లేవగానే మంచినీళ్లు తాగడం మాత్రం మరిచిపోకండి.
ఇది కూడా చదవండి ==> ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?